జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళతానన్న ముఖ్యమంత్రి

Tuesday, December 27th, 2016, 05:21:01 PM IST

kcr1
తెలంగాణ లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుండి ఒకరిపై ఒకరు విమర్శలు సందించుకుంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళుతాను అన్నారు.

గతంలో ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నేతల ఇళ్లకు వెళ్లి భోజనాలు చేసే సంప్రదాయం ఉండేదన్నారు. అలాగే తాను కూడా ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతిపక్షనేత ఇంటికి వెళ్లి భోజనం చేయాలన్న కోరిక మాత్రం ఉందని కేసీఆర్ అన్నారు. ఈ మాటలకు సభలో ఉన్నవారంతా పగలబడి నవ్వారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణానికి పేదలు తీసుకున్న రుణ బకాయిలు మొత్తాన్ని 3,920 కోట్లను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అసెంబ్లీలో బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణంపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ కీలక ప్రకటన చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments