కేసిఆర్ కి పిచ్చి : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Friday, September 7th, 2018, 12:03:33 PM IST

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నిన్న తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసినదే, అయితే రాజీనామా చేసిన అనంతరం, ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తెలంగాణా ర్రాష్ట్ర ముఖ్య మంత్రి ఐన కే సి ఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తెలంగాణా ముఖ్య మంత్రికి పిచ్చి పట్టిందని, ఆ పిచ్చి పరాకాష్టకు చేరుకున్నది అని ప్రస్తావించారు. ఆయనకీ జాతకం చెప్పేది ఎవరో ఆయన జాతకం బాగోకపోతే రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలని నాశనం చెయ్యడానికి కంకణం కట్టుకున్నాడు అని ఎద్దేవా చేశారు.

ఇలాంటి మతిస్థిమితం లేని ముఖ్యమంత్రి ఉన్న సభలో ఉన్న సభ్యులకు గౌరవం లేదని, ప్రజాస్వామ్య విలువలు, చట్టాలు, శాసనాలు పట్ల వారికి అవగాహన ఉన్నదో లేదో అని ప్రశ్నించారు. ఇలాంటి వారు అందరు ఉన్న సభలోకి తాను ఉండలేక ప్రజాక్షేత్రం లోకి వెళ్లి ప్రశ్నించాల్సిన ప్రాథమిక భాద్యత మాపై ఉన్నది అని రాజీనామా లేఖను సమర్పించినట్టు తెలుపుతున్నారు. వారి కుటుంబం ఆస్తులు పంపకాలు తప్ప ప్రజల కోసం కానీ, రైతుల కోసం కానీ నిరుద్యోగులు కోసం గాని ఇక్కడ దళితులకు ఇస్తా అన్న రేజర్వేషన్లు కోసం కానీ ఏ మాత్రం పట్టించుకోవట్లేదు అని తెలిపారు.

గత పది రోజులుగా సిఎం వైఖరి చాలా విడ్డూరంగా ఉంది అని, పిచ్చి పట్టిన వ్యక్తిలా వ్యవహరిస్తున్నాడు అని ఎప్పుడు ఎం మాట్లాడుతున్నాడో తనకే అర్ధం కాదు అని, మొన్న జరిగిన బహిరంగ సభలో నాలుగు గంటలకు హాజరు కావాల్సి ఉండగా ఆరు గంటల వరకు అలా హెలికాఫ్టర్ లో గాలిలోనే తిరుగుతున్నాడు అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు.

  •  
  •  
  •  
  •  

Comments