ఆ బాధ్యత నాదే!

Tuesday, October 14th, 2014, 08:33:14 PM IST

kcr13
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ తో సహా అన్ని నగరాల అభివృద్ధి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. అలాగే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాల అభివృద్ధిని తామే చూస్తామని కెసిఆర్ వివరించారు. ఇక నగరాలలో నీళ్ళు, రోడ్లు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య రంగాలపై దృష్టి పెడతానని కెసిఆర్ తెలిపారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల తర్వాత స్వయంగా నగరాలను సందర్శిస్తానని తెలిపారు. నగరాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని, వాటర్ గ్రిడ్ ద్వారా అన్ని నగరాలకు మంచి నీరు అందిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే హైదరాబాద్ లో నాలాలను చక్కదిద్దేందుకు 10వేల కోట్లు కావాలని కెసిఆర్ తెలిపారు. ఇక డిసెంబర్ నుండి చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మొదలు పెడతామని, అందులో సీఎం నుండి పాఠశాల విద్యార్ధుల వరకు ప్రజలందరూ పాల్గొనేలా కార్యక్రమం రూపొందిస్తామని కెసిఆర్ పేర్కొన్నారు. అలాగే జూరాల,పాకాల ఎత్తిపోతల ప్రాజెక్టుపై దృష్టిపెడతామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో వైద్య కళాశాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని ఉపముఖ్యమంత్రి రాజయ్యకు కెసిఆర్ సూచనలు ఇచ్చారు.