ఓడిపోయిన నేతలకు బంపర్ ఆఫర్ ప్రకటించనున్న కెసిఆర్

Tuesday, April 16th, 2019, 12:20:12 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు తెలంగాణ లో తెరాస పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కాగా ఈ సమావేశంలో సీఎం కెసిఆర్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఇటీవల తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు కీలక పదవులు ఇస్తానని మాటిచ్చారు. అంతేకాకుండా పార్టీలో కీలక బాధ్యతలు కూడా అప్పగిస్తానని ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణ పై కెసిఆర్ చర్చించారు.

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలని కెసిఆర్ సూచించారు. అంతేకాకుండా రాష్ట్రంలో పూర్తిగా గులాబీ జండా ఎగరేయడమే లక్ష్యంగా పని చేయాలనీ, రానున్న ఎన్నికల్లో అన్ని జడ్పీ స్థానాల్లో గులాబీ జెండా ఎగిరేలా పని చేయాలనీ కెసిఆర్ సూచించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు జెడ్పీ చైర్మన్ అఫర్ ఇచ్చారు. ఆసిఫాబాద్ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని తొలి అభ్యర్థిగా, పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకి చైర్మన్ గా ఛాన్స్ ఇచ్చారు. మరికొందరికి కూడా అవకాశం దక్కేలా ఉందని ఆశావహులు చెబుతున్నారు.