గులాబీ ద‌ళ‌ప‌తి మ‌ళ్లీ అదే బూతు పురాణం!

Saturday, October 6th, 2018, 07:12:16 PM IST

బూతూ బూత‌స్య‌.. బూతు పురాణ‌స్య‌.. బూతేంది.. బూత్ ఎల‌క్ష‌న‌స్య‌! మ‌రోమారు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర అప‌ద్ధ‌ర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుస‌రించు విధంబు ఇదీ… డౌట్‌గా ఉంటే మ్యాట‌ర్‌లోకెళ‌దామా..

తెలంగాణ ఉద్య‌మం ఉదృతంగా వున్న స‌మ‌యంలో కేసీఆర్ ధాటికి కుదేలైన వాళ్లెంద‌రో… ఆయ‌నకు కౌంట‌ర్ వెయ్యాలంటేనే విప‌క్ష నాయ‌కుల వెన్నులో ఒణుకు పుట్టేది. ఆ స‌మ‌యంలో ఏ స‌భ పెట్టినా కేసీఆర్ స్పీచ్ ను ఆస్వాధించాల‌ని తెలంగాణ ప్ర‌జానీక‌మే కాకుండా ఆంధ్రా మేధావులు, సామ‌న్య ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురు చూసిన సంద‌ర్భాలు కో కొల్ల‌లు. మాట‌ల తూటాల‌తో తెలంగాణ ఉద్య‌మ సార‌థిగా తెలంగాణ‌లోనే తిరుగులేని నాయ‌కుడిగా ఎదిగిన కేసీఆర్ తెలంగాణ ఏర్ప‌డి కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌రువాత త‌న స్వ‌రాన్ని మార్చిన ఆయ‌న గ‌త కొంత కాలంగా అదే పంథాను కొన‌సాగిస్తున్నారు.

అయితే అర్థాంత‌రంగా తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దుచేసి ముంద‌స్తుకు సిద్ధ‌మైన కేసీఆర్ మ‌ళ్లీ త‌న పాత ప‌ద్ద‌తిలోకి వ‌చ్చేశారు. ఉద్య‌మ స‌మ‌యంలో త‌న ప్రంగాల ప్ర‌వాహంలో కొట్టుకుపోయిన నాయ‌కులెంద‌రో. చంద్ర‌బాబు, ఉత్త‌మ్‌, మోదీ ద‌గ్గ‌రి నుంచి అంద‌రు నాయ‌కులు కేసీఆర్ పవ‌ర్‌ఫుల్ పంచుల‌కు బెంబేలెత్తిన వారే. ఇప్పుడు అదే స్థాయి స్వ‌రాన్ని.. అదే దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్న కేసీఆర్ పాత స్టైల్లోనే ప్ర‌త్య‌ర్థుల్ని త‌న స‌హ‌జ‌సిద్ధ‌మైన బూతు పురాణంతో ఏకి పారేస్తుండ‌టం రాజ‌కీయ విశ్లేష‌కుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. తాజాగా నిర్వ‌హించిన ఎన్నిక‌ల శంఖారావంలో కేసీఆర్ స్పీచ్ ను విన్న వాళ్లంతా కేసీఆర్ ఈజ్ బ్యాక్! అంటూ మురిసిపోతున్నారు. బూతుల యందు నైజాం యాక్సెంట్ బూతులు వేర‌యా విశ్వ‌ధాభిరామ వినుర‌వేమ!!