డ్యామిట్.. ప్లాన్ డిజాస్టరైంది !

Thursday, October 4th, 2018, 09:23:19 AM IST

ఆరోపణల్ని పటాపంచలు చేయడానికే ముందస్తుకు వెళుతున్నామని చెబుతున్న కేసిఆర్ ఈ ఎన్నికల కోసం రెండు భారీ పథకల్ని అమలుచేయడానికి చాన్నాళ్ల క్రితమే ప్లాన్ చేసుకున్నారు. ఆ పథకాలే బతుకమ్మ చీరల పంపిణీ, రైతు బంధు చెక్కుల పంపిణీ. ఈ రెండు పథకాల్ని ముమ్మరంగా అమలుచేస్తే ఎన్నికల్లో తమకు తిరుగుండదని కేసిఆర్ భావించారు.

అందుకే కోటి బతుకమ్మ చీరల్ని రెడీ చేయించారు. తీరా వాటిని పంచడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో ఎన్నికల కమీషన్ కోడ్ ను అమల్లోకి తేవడంతో కేసిఆర్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఒక్కటంటే ఒక చీరను కూడ ఆడపడుచులకు అందివ్వలేకపోయారు. అలాగే రైతు బంధు పథకం ద్వారా 50 లక్షల మందికి 6000 కోట్లను చెక్కుల రూపంలో పంచాలని, ఈ పథకంతో తమకు ఎదురే ఉండదని ప్లాన్ వేశారు. ఇప్పుడు అది కూడ అమలయ్యేలా కనిపించడం లేదు.

అధికారంలో ఉండగా చేయాల్సిన ఈ పనుల్ని ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం వాడుకోవాలన్న కేసిఆర్ ప్లాన్ అడ్డం తిరిగి ప్రజలకు అందాల్సిన లబ్ది అందకుండా పోయింది. ఇకపై గులాబీ దళం చేతల్తో చేసేదేమీ ఉండదు, ఏదైనా సరే మాటల్తోనే నెట్టుకు రావాలి.