బుజ్జగించే పనిలో పడ్డ కేసీఆర్!

Saturday, September 8th, 2018, 10:10:45 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు ప్రణాళికలు రచించడంలో బిజీ అయ్యారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అందరికి షాకిచ్చిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వాతావరణం మరింత వేడెక్కనుంది. దీంతో అభ్యర్థులను నిర్ణయించడంలో పార్టీ అధిష్టానాలు చర్చలు జరుపుతున్నాయి. ఇకపోతే టికెట్టు దక్కని వారితో కూడా పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది ఘనకా వారిని ముందుగానే బుజ్జగించే పనిలో పడ్డారు చాలా మంది అధ్యక్షులు.

టీఆరెస్ పార్టీలో ప్రస్తుతం కేసీఆర్ అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పెద్దగా మార్పులేమీ లేకుండా రెండు స్థానాల్లో ఇద్దరి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్టు ఇవ్వలేదు. ముఖ్యంగా ఆంథోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ కి ఈ సారి అవకాశం ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో బాబు మోహన్ లాగడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా బాబూమోహన్ తో చర్చలు జరిపారు. రీసెంట్ గా ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌కు పిలిపించుకుని మాట్లాడారు. రాజకీయ భవిష్యత్తుపై అనుమానం అవసరం లేదని తప్పకుండా ఇతర పదువులు దక్కేలా చూస్తానని అభయమిచ్చారట. బాబు మోహన్ తో పాటు నల్లాల ఓదెలుతో కూడా చర్చలు జరిపి బుజ్జగించినట్లు తెలుస్తోంది. మ్మెల్సీ కానీ, ఇతర పదవులు కానీ తప్పకుండా ఇస్తానని కేసీఆర్ తెలుపడంతో నేతలు చల్లబడినట్లు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments