మోడీకి కేసీఆర్ కోర్కెల చిట్టా

Saturday, September 6th, 2014, 08:00:23 PM IST


తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. మోడీతో కేసీఆర్ అరగంట పాటు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలతో పాటు కొన్ని కోర్కెలను విప్పారు. 21 అంశాలను ప్రధాని దృష్టికి తెచ్చారు.

కేసీఆర్ కోరిన అంశాలు:
ప్రతి రాష్ట్రానికి కేటాయించే ఆరు కోట్ల రూపాయల నిధులకు మరో ఆరు కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి.

ప్రత్యేక హోదా కల్పించాలి..
పన్ను రాయితీ కల్పించాలి..
బొగ్గు కేటాయింపులు జరపాలి..
400 మెగావాట్ల విద్యుత్ అందించాలి..
1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సహాయం చేయాలి.
తెలంగాణలో కూడా స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయాలి..
పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను సత్వరంగా పూర్తి చేయాలి..
తెలంగాణలో కూడా తాగు నీరందించాలి..
ఉత్తర తెలంగాణలో ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయాలి..
అధికారుల విభజన త్వరగా ఏర్పాటు చేయాలి.
ఏపీ నుంచి హైకోర్టును విభజించాలి..
ఐఐఎం ఏర్పాటు చేయాలి..
ఎన్ఐటి వరంగల్ లోనే ఉంచాలి..
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేయాలి..
ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయాలి..

కేసీఆర్ కోరిన అంశాలపై ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. సోలార్ పవర్ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు పంపాలని.. అలాగే మేయర్ల సదస్సుకు సంబంధించిన వివరాలను పంపించాలని మోడీ కోరినట్లు సమాచారం. తెలంగాణలో నెలకొన్న సమస్యలను కేంద్రం పెద్దన్న తరహాలో పరిష్కరిస్తుందని తెలిపినట్లు తెలుస్తోంది.