అందరికంటే ముందుగానే కర్ణాటకలో కేసీఆర్!

Tuesday, May 22nd, 2018, 02:25:37 PM IST

ఫైనల్ గా కర్ణాటక ముఖ్యమంత్రి విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. నిన్నటి వరకు జేడీఎస్ నేత కుమార స్వామి అధికారాన్ని అందుకుంటారని తెలిసినప్పటికీ కొన్ని రూమర్స్ అనుమానాలను రేపాయి. అయితే మొత్తానికి కాంగ్రెస్ మద్దతుతో కుమార స్వామి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీ కి సంబందించిన నేతలను ప్రమాణ స్వీకార వేడుకకు కాంగ్రెస్ – జేడీఎస్ ఆహ్వానించింది. ఇక జేడీఎస్ తో ముందు నుంచి సన్నిహితంగా ఉన్న కేసీఆర్ ని కూడా కుమార స్వామి ఆహ్వానించారు.

మొదట కొన్ని పనుల వలన కేసీఆర్ హాజరుకాకపోవచ్చు అనే టాక్ వచ్చినా రీసెంట్ గా మళ్లీ ఆయన తన నిర్ణయాన్నీ ఫైనల్ చేశారు. ఈ రోజు సాయంత్రమే అందరికంటే ముందుగా వెళ్లి జేడీఎస్ నేతను ప్రత్యేకంగా కలవనున్నారు. అలాగే దేవా గౌడ తో సమావేశం కానున్నారు. ఇక సమావేశం అనంతరం కేసీఆర్ ఈ రాత్రికే హైదరాబాద్ కు రానున్నారు. స్పెషల్ విమానంలో మంత్రులతో పాటు బెంగుళూరుకు వెళ్లి కేసీఆర్ కుమారిస్వామిని కలవనున్నారు. రేపు అత్యవసర మీటింగ్ లు ఉన్నందున ప్రమాణస్వీకారానికి రాలేకపోతున్నట్లు కేసీఆర్ జేడీఎస్ నేతలకు వివరించినట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments