చంద్రబాబును తిడితే 100 సీట్లు కష్ఠం కేసిఆర్ !

Tuesday, October 23rd, 2018, 12:39:50 PM IST

తెరాస సారథి కేసిఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టినా చంద్రబాబును అదే పనిగా ఏకేస్తున్నారు. బాబు తెలంగాణకు పట్టిన శని అని, మరోసారి అధికారం ఇస్తే తెలంగాణ గతి అధోగతిని, ఇన్నేళ్లు తెలంగాణను భ్రష్టు పట్టించింది చంద్రబాబేనని, ఓటు నోటు కేసుకు బయపడి హైదరాబాడ్ వదిలి అమరావతిలో దాక్కున్నాడని రకరకాలుగా బాబును తిట్టిపోశాడు కేసిఆర్. ఈ పద్దతి ఆరంభంలో బాగానే ఉన్నా పోను పోను కేసీఆర్ కే నెగెటివిటీని తెచ్చి పెట్టింది.

తెలంగాణ ఓటర్లలో బీసీలు, ఆంధ్రా నుండి వచ్చి సెటిలైన వాళ్ళు మంచి సంఖ్యలోనే ఉన్నారు. ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 నుంచి 30 స్థానాల వరకు గెలుపోటములను వారు ప్రభావితం చేయగలరు. చాలా ఏళ్ల క్రితం ఇక్కడికొచ్చి సెటిలైన ఆంధ్రా వాళ్ళు తెలంగాణ బిడ్డలేనని కేసిఆర్ అంటున్నా కూడ ఆయన అవసరానికి మించి బాబును తిట్టడం బీసీలకు, సెటిలర్లకు నచ్చడం లేదు.

సోషల్ మీడియా లాంటి వేదికల్లో ఈ విషయం ఇప్పటికే తేటతెల్లమైంది. సెటిలర్లు, బీసీలు చాలా మంది కాంగ్రెస్, టీడీపీల మహాకూటమికి మద్దతిచ్చేలా కనిపిస్తున్నారు. ఇదే పద్దతిని ఇంకొన్నిరోజులు కేసిఆర్ పాటిస్తే మిగిలిన వాళ్ళు కూడ పూర్తిగా మహాకూటమి వైపుకు వెళ్లిపోయే ప్రమాదముంది. దీంతో కేసిఆర్ కలలు కంటున్నా 100 సీట్ల మ్యాజికల్ ఫిగర్ సంగతి ఎలా ఉన్నా అధికారాన్ని అందుకోవడానికి కూడ కష్టపడాల్సి వస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments