కేసీఆర్‌ విడ‌వ‌ర‌ని వినోద్ కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు!

Saturday, September 22nd, 2018, 12:44:04 PM IST


తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు గ‌త కొన్ని నెల‌ల క్రితం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజ‌కీయాల్లో చ్ర‌కం తిప్పాల‌ని కొన్ని రోజులు వివిధ రాష్ట్రాల ముఖ్య నేత‌ల‌ను క‌లుస్తూ జాతీయ రాజ‌కీయాల్లో ప్రాంతీయ పార్టీల ఆధిప‌త్యం అంటూ హ‌డావిడి చేసిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్‌, బీజేపీల‌కు ప్ర‌త్యామ్న‌యంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో మ‌హాకూట‌మిని ఏర్పాటు చేయాల‌ని, త‌ద్వారా జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని క‌లలు క‌న్న కేసీఆర్ త‌న‌ హ‌డావిడిని ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో సైలెంట‌య్యారు. ఆ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం తెలంగాణలో అసెంబ్లీని ర‌ద్దుచేసి ముంద‌స్తుకు సిద్ధ‌మైకావ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీసింది.

అయితే జాతీయ రాజ‌కీయాల్లో తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి చ‌క్రం తిప్ప‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, పార్ల‌మెంట్ స‌భ్యుడు వినోద్‌కుమార్ అంటున్నాడు. రానున్న ఎన్నిక‌ల్లో కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లో కీల‌కం కానున్నార‌ని, ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌రువాత జాతీయ స్థాయిలో రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ‌లో భాగంగా స‌మూల మార్పులు చోటు చేసుకుంటాయ‌ని, వాటికి కేసీఆర్ నేతృత్వం వ‌హించి జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్ప‌డం త‌ధ్యం అని ఆయ‌న ఘ‌టాప‌థంగా చెబుతున్నారు.

కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లో ఎంత చురుగ్గా పాల్గొన్నా తెలంగాణను మాత్రం వీడ‌ర‌ని తేల్చి చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. తెలంగాణ‌లో ఇచ్చిన హామీలను నెర‌వేర్చిన త‌రువాతే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని అనుకున్నాం. ఆ ర‌కంగానే ముందుస్తుకు సిద్ధ‌మ‌య్యాం. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల‌దే హ‌వా అన‌డానికి ఈ ఎన్నిక‌లే వేదిక కానున్నాయ‌ని, దీని ప్ర‌భావం జాతీయ పార్టీల‌పైనా వుంటుంద‌ని వినోద్ చెబుతున్నారు. ఎంపీ వినోద్ కుమార్ చెబుతున్న‌ట్టు జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల హ‌వా కొన‌సాగినా జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నే కేసీఆర్ క‌ల నెర‌వేరే ఛాన్సుంద‌ని భావించ‌వచ్చు.