కెసిఆర్ దూకుడు.. సాటి ఎవ్వడు ?? కూల్చడం షురూ.. ఆగడం ఉండదు

Wednesday, September 28th, 2016, 03:05:38 PM IST

kkkk
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కి కోపం ఒస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైనా విషయంలో చెడ్డపేరు ఒస్తే ఆయన ససేమిరా ఊరుకోరు, పైగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలోని కొత్తగా ఏర్పడిన తన సొంత ప్రభుత్వానికి తీరని మచ్చ ఏర్పడింది. ఇక ఆయన ఊరుకుంటారా ? జలజలా నేలజారిన వాన తెరాస సర్కారుకి తలనొప్పిగా మారింది. ఇష్టం వచ్చినట్టు లే ఆవుట్ లు లేకుండా ఇచ్చిన కట్టడాల వలన వర్షం జనాల కి ఇబ్బందులు పెట్టిన తరుణంలో కెసిఆర్ సర్కారు ఏం చేస్తోంది అంటూ నేషనల్ మీడియా లో సైతం భారీగా వార్తలు వచ్చేసాయి. దాంతో కెసిఆర్ కి తెగ కోపం వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ లో సెలెక్ట్ చేసిన ప్రాంతాలలో కూల్చివేతలు మొదలు అయ్యాయి. ఏదైనా అంశం మీద ఫోకస్ చేస్తే దాని అంతు చూసే వరకూ వదిలిపెట్టని కేసీఆర్ వైనం అందరికి తెలిసిందే. అక్రమ నిర్మాణాలు తాము అధికారంలోకి ఒస్తే కూల్చి తీరతాం అని మాట ఇచ్చిన కెసిఆర్ తరవాత సైలెంట్ అయిపోయారు . అప్పుడు మాట ఇచ్చిన పని చెయ్యకపోవడం వలన ఎంత నష్టం జరిగిందో తెలుసుకున్న కెసిఆర్ ఇప్పుడు అదే పనిమీద నడుం బిగించారు. ఆయన ఎప్పుడూ ఆక్రమ కట్టడాల కూల్చివేత లాంటి అంశాల మీద ఇంత తీవ్రంగా నిర్ణయాలు తీసుకున్నది లేదు. ఆ మాటకు వస్తే ఉమ్మడి రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి ఇంత సాహసానికి తెర తీయలేదని చెప్పాలి. భారీ వర్షాల దెబ్బకి కెసిఆర్ హైదరాబాద్ అతలాకుతలం అవ్వడం , మీడియా హై లైట్ గా ఈ విషయం చూపించడం హైదరాబాద్ కు సముద్రాన్ని తీసుకొచ్చేశారన్న తరహా వ్యంగ్య వ్యాఖ్యలు కేసీఆర్ కు ఒళ్ళు మండేలా చేశాయన్న మాట వినిపిస్తోంది. హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతినే విధంగా ఈ వర్షాలు నిండా ముంచేసాయి. సో ఇప్పుడు బ్రహ్మాస్త్రం చేతబూనిన కెసిఆర్ తన మార్క్ ని చూపించే పనిలో పడ్డారు. ఎవ్వరు అడ్డం వచ్చినా, ఎన్ని రికమెండేషన్ లు వచ్చిన సాక్షాత్తూ కేంద్రం నుంచి అనధికార ఫోన్ లు ఒస్తున్నా కూడా కెసిఆర్ వెనక్కి తగ్గడం లేదు. స్వపక్షం – విపక్షం – స్నేహితులు – తెలిసినోళ్లు… ఎవరైనా సరే అక్రమం.. అక్రమమే. ఆ విషయంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్లుగా కేసీఆర్ వ్యవహరించటం మొదలెట్టారు. అక్రమ కట్టడాలు ఒక్కొక్కటిగా కూలుతున్నాయి , నాలా లని ఆక్రమించి కట్టిన కట్టడాలు ఇప్పుడు పోతున్నాయి. మొదటి రోజు రాజకీయ నేతల జోక్యం ఎక్కువగా ఉండడం తో అక్కడక్కడా కాస్త నేమ్మదించాయి గానీ రెండవ రోజు మాత్రం ఒక్క రోజులోనే నాలాలపై ఉన్న 25 నిర్మాణాలను.. మరో 43 అనధికార భవనాల్ని కూల్చివేశారు. కేవలం ఒకే ఒక్క ప్రాంతానికి ఈ కూల్చివేసే ప్రోగ్రాం పెట్టకుండా పూర్తిగా హైదరాబాద్ మొత్తం నిర్వహిస్తున్నారు. కెసిఆర్ వెనుకా ముందు చూసుకోకుండా రూల్ బుక్ కు తగ్గట్లుగా లెక్క చూసుకొని కొట్టేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.

Comments