బిల్డింగ్ లు బద్దలవుతున్నాయి..వార్నింగ్ ఇచ్చిన 48 గంట‌ల్లో !

Monday, September 26th, 2016, 03:44:11 PM IST

kcr
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సీఎం పీఠం ఎక్కిన వెంట‌నే హైద‌రాబాద్ లో అక్ర‌మ క‌ట్ట‌డాలు కూల్చివేత ఎజెండ‌గా దూసుకుపోయారు. ఆ బిల్డింగ్ అక్ర‌మ కట్ట‌డం అని తెలిస్తే చాలు శివాలెత్తిపోయేవారు. దాని వెనుక ఎలాంటి రాజ‌కీయ శ‌క్తులున్నా… బ‌డా కోటీశ్వ‌రుడైనా స‌రే ఐ డోంట్ కేర్ అంటూ జేసీబీల‌తో నేల‌మ‌ట్టం చేయించారు. త‌ర్వాత ఎందుకనో ఆ స్పీడును త‌గ్గించేశారు. తాజాగా మ‌ళ్లీ ఇప్పుడు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన నాలాల‌పై నిర్మాణాల‌ను కూల్చివేయాల‌ని కేసీఆర్ జీహెచ్ ఎంసీ అధికారాల‌ను ఆదేశించారు.

న‌గరంలో ప‌లు ప్రాంతాల్లో ఆక్ర‌మ‌ణ‌కు గురైన నాల‌ల‌ను కూల్చి వేయ‌డం మొద‌లు పెట్టారు. శేరిలింగంప‌ల్లి, మ‌దీనాగూడ‌, గ‌చ్చిబౌలి నుంచి కొత్త‌గూడ వ‌ర‌కూ ఉన్న నాలాల‌పై ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొలగిస్తున్నారు. ఇలా జంట‌న‌గ‌రాల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన వాటిన్నింటిని కూల్చి వేసే వ‌ర‌కూ ప‌నులు ఆప‌వ‌ద్ద‌ని అధికారుల‌కు సూచించారు దీంతో హైద‌రాబాద్ ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ చ‌ర్య‌ల ప‌ట్ట హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments