తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు వెళ్తున్నారో తెలుసా….?

Monday, January 23rd, 2017, 09:55:11 AM IST

kcr1
ప్రత్యేక తెలంగాణ సాధించడం కోసం ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ అనే పార్టీ పెట్టి ఆంధ్రా నాయకుల మీద కేసీఆర్ యుద్దానికి సిద్దమయ్యి దాదాపు 12 సంవత్సరాలు ఏకధాటిగా పోరాడి చివరికి తాను అనుకున్నది సాధించారు. తెలంగాణ ప్రజలందరినీ ఒక్కతాటిపై నడిపించి కేంద్రం మెడలు వంచి 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము సాధించుకున్నారు. తరువాత జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఘన విజయం సాధించి ‘తెలంగాణ’ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి చరిత్రలో నిలిచిపోయారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆంధ్ర నాయకుల పేరు చెప్తే తాచుపాములా బుసలు కొట్టేవారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ అప్,నిప్పులా ఉండేవాళ్ళు. క్రమేపీ వీళ్ళ మధ్య స్నేహ బంధాలు నెలకొంటున్నట్టు కనిపిస్తుంది. చివరిసారిగా కేసీఆర్ అమరావతి శంకుస్తాపన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడడానికి లేచినపుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలనుండి ఎంత రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే..

ఈ నేపథ్యంలో కేసీఆర్ మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. అయితే ఇది రాజకీయపరమైన పర్యటన కాదు. కేవలం ఆయన మొక్కు తీర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ పలు దేవాలయాల్లో మొక్కుకున్న విషయం తెలిసిందే.. ఆ మొక్కులు తీర్చుకోవడానికే ఆయన ఈ నెల 30న విజయవాడ, తిరుమలలో పర్యటించనున్నట్టు తెలుస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి కేసీఆర్ మొక్కులు చెల్లించనున్నారు.