అసెంబ్లీ ఎందుకు రద్దు చేసాం..?రహస్యం బయట పెట్టిన కెసిఆర్.

Friday, September 7th, 2018, 06:25:14 PM IST

నిన్న ప్రగతి భవన్ లో సీఎం కెసిఆర్ సహా వారి ఎమ్మెల్యేలు అందరు కొన్ని కీలక నిర్ణయాలు చర్చలు తర్వాత అందరి ఆమోదంతో ముందస్తు ఎన్నికలను కోరుతూ వినతి పత్రాన్ని గవర్నర్ గారికి అందజేసి అసెంబ్లీని రద్దు చేసిన సంగతి తెలిసినదే. అయితే ఆ అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారు అన్నది. ఏ కారణాల వాళ్ళ రద్దు చేసాం అనేది దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే దాని కోసం ఈ రోజు తెలంగాణా హుస్నాబాద్ లో జరిగిన “ప్రజా ఆశీర్వాద సభ” లో కెసిఆర్ పేర్కొన్నారు..

కాంగ్రెస్ నేతలు నోరు ఉంది కద్దా అని ఏది పడితే అది వాడుతున్నారు అని, గత కొన్ని రోజుల కింద వారిని మేము తప్పులు చేసినట్లు ఐతే మీకు దమ్ము నిజాయితీ ఉంటె మీరు మేము ప్రజా క్షేత్రం లోకే వెళ్లి అడుగుదాము ఎవరిని మీరు నమ్మే పరిస్థిలో ఉన్నారు అన్న దాని కోసం వారు ముందు సరే అని ఇప్పుడు ఎక్కడో గోడలు గీకుతున్నారు అని సీఎం అన్నారు.

అదే సందర్భం లో అసెంబ్లీ రద్దు విషయం పై మాట్లాడుతూ.. ఇంకా 7 నెలల సమయం ఉంది,సంపూర్ణమైన మెజార్టీ ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఐన ఎందుకు అధికారాన్ని వాడుకులుకున్నాం..? కేవలం తెలంగాణా అభివృద్ధి కోసం, అని 21.96 అభివృద్ధి వచ్చిందో ఆ అభివృద్ధి అలా కొనసాగాలి అని, జరుగుతున్న అభివృద్ధి పనులు ఎట్టి పరిస్థిలోను నిలిపోకూడదు అంటే ప్రతిపక్షము వారు చేస్తున్న పిచ్చి మాటలకు సమాధానం చెప్పాల్సింది ప్రజలే అని, మంచి ఎదో చేడు ఎదో నిర్ణయించాల్సినది మీరే అంటూ ఈ సారి వచ్చే ఎన్నికల్లో తెరాస ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేస్తే కోటి ఎకరాలు ఉన్న తెలంగాణను పచ్చగా మార్చాలన్న ఉద్దేశం తో టీఆరెస్ త్యాగం చేసింది తప్ప వేరే ఎవరి కోసము త్యాగం చెయ్యలేదు అని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments