కృష్ణ సభ్యుడిగా 4 వేల ఎకరాల్లో ఫిల్మ్ సిటీ..!

Saturday, September 27th, 2014, 06:06:28 PM IST

filim-city
తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో సినిమా సిటీ ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు దాన్ని రెట్టింపు చేశారు. హైదరాబాద్‌లో నాలుగు వేల ఎకరాల్లో అద్భుతమైన ఫిల్మ్ సిటీ నిర్మిస్తామని కేసీఆర్ ప్రకటించారు. సినిమా సిటీ బోర్డులో హీరో కృష్ణను సభ్యుడిగా నియమిస్తామని కేసీఆర్ తెలిపారు. కృష్ణ అనుభవాలను ఫిలిం సిటీ అభివృద్ధికి వినియోగించుకుంటామని తెలిపారు.

కేసీఆర్ సిటీ ప్రకటనను స్వాగతిస్తూ దానికి కేసీఆర్ పేరు పెడితే బాగుంటుందని ఇటీవల హీరో కృష్ణ అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. ఈ నేపథ్యంలో సినిమా సిటీ బోర్డులో కృష్ణను సభ్యుడిగా నియమిస్తామని కేసీఆర్ తాజాగా ప్రకటించారు.