అధికారులతోనే పాలన పరుగు

Friday, September 12th, 2014, 05:07:16 PM IST


సాధారణంగా సచివాలయం.. క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రులు పాలన సాగిస్తారు.అభివృద్ది కార్యక్రమాలు.. ప్రారంభోత్సవాలకు టూర్ వెళ్లడం, విదేశీ పర్యటనలు, కేంద్రంతో సంప్రదించేందుకు ఢిల్లీ టూర్లు. కొన్ని కీలక మైన అంశాలు తీసుకునే క్రమంలో మంత్రివర్గం.. ఉన్నతాధికారులు.. అవసరమైన సందర్భాల్లో పార్టీ నేతలను ఇన్వాల్ చేయడం కామనే. కానీ కొత్త రాష్ట్రం.. కొత్త పాలన.. సరికొత్త పంథా అంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతి అంశంలోనూ డిఫెరంట్ గా ముందుకు వెళ్తున్నారు.. ప్రతి నిర్ణయం.. పాలసీలపై సుదీర్ఘంగా చర్చలు చేస్తున్నారు.

అందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గంటల కొద్ది సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రతి విషయంలోను అధికారులే కీలకమంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై జిల్లా, మండల లెవల్ అధికారులతో గంటల కొద్ది సదస్సులు నిర్వహిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే కోసం రాత్రి వరకు హెచ్ ఐసీసీలో సమావేశం నిర్వహించారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో గంటల కొద్ది సమీక్షలు నిర్వహించారు. ప్రతి కార్యక్రమంలోను మండల లెవల్ అధికారులను కలుపుకుంటూ.. వారితో మాట్లాతుతున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా వారి నుండి సలహలు సూచలను తీసకుంటూనే వారికే ఆదేశాలు జారీ చేస్తున్నారు.

ప్రభుత్వానికి సమాచారం కావాలంటే.. సర్వేలు చేయాలంటే ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే వారు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రతిదీ సర్కార్ చేయాలనుకుంటున్నారు. అందుకు అన్ని శాఖలను మమేకం చేస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే నుంచి మొదలు.. అన్నింట్లోనూ ఇదే ఆలోచనతో ఉన్నారు. ఈనెల 10న జరిగిన వాటర్ గ్రిడ్ పథకంపై మండల స్థాయి గ్రామీణా మంచినీటి కి చెందిన 650 మంది ఇంజనీర్లతో సమావేశంలోనూ అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. అయ్యారు. వాటర్ గ్రిడ్ పథకం ప్రాధన్యతపై గంటల కొద్ది దిశ నిర్ధేశం చేసిన ఆయన.. ఈ పథకం పనులను ప్రయివేటు ఏజెన్సీకి కట్టబెట్టాలా..? లేక మనమే చేద్దామా..? మనకు చేతకాదా..? ఏమంటారు అంటూ అధికారులను అడిగారు. నాకైతే మీపై విశ్వాసం ఉందంటూ.. చేయ్యి ఎత్తారు.. దీంతో ఇంజనీర్లు కూడా చేతులెత్తారు. మీరే సమర్ధులంటూ వారిని కొనియాడారు. వాటర్ గ్రిడ్ పథకంపై 15 రోజుల్లో సర్వే చేయాలని అధికారులకు అక్కడే ఆదేశాలు జారీ చేశారు.

ఉద్యోగులకు, అధికారులను భాగస్వాములను చేస్తున్న కేసీఆర్.. వారి సమస్యలు..సౌకర్యాలు కల్పించడంలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. వారికి ప్రమోషన్లు.. ఇంక్రిమెంట్లు ఇవ్వడంతో పాటు.. రాజకీయ ఒత్తళ్లు ఉండవని హామీ ఇస్తూనే.. మరోవైపు మంత్రుల పనితీరు ఇంకా మెరుగవ్వాలని.. అందుకు కొందరి శాఖలు కూడా మారుస్తారని ప్రచారం జరుగుతోంది. మరో వైపు అధికారులు నర్సింహా అవతారం ఎత్తితే అభివృద్ది సాధించవచ్చని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ వ్యూహ్యం ఏ మేరకు ఫలించి ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారా.. మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.