కొంచెం ఆగండి.. తొందరేమీ లేదు !

Sunday, February 10th, 2019, 01:58:20 PM IST

ఎన్నికలు, ముగిసి అధికారం చేపట్టి రెండు నెలలు గడుస్తున్నా మంత్రివర్గ విస్తరణ చేపట్టకుండా కేసీఆర్ నాన్చుతుండటం ఎమ్మెల్యేల్లో టెంక్షన్ క్రియేట్ చేస్తుంటే జనంలో నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. సిఎంతో పాటు మంత్రివర్గంలో మహమూద్ అలీ మాత్రమే ఉన్నారు. కొన్నిరోజుల క్రితం ఈరోజు ఆదివారం విస్తరణ ఉండవచ్చనే ప్రచారం జరిగింది. కానీ అదేం లేదని తేలిపోయింది. నిన్న ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిన కేసీఆర్ ఇంకా శాఖల పునర్వ్యవస్తీకరణ జరుగుతోందని, అందుకే విస్తారం ఇప్పుడప్పుడే ఉండదని చెప్పారట.

ఇప్పుడున్నట్టే శాఖల్ని మంత్రులకు కేటాయిస్తే ఎలాటి ఉపయోగం ఉండదని, అభివృద్ధి జరిగే అవకాశం తక్కువని, అందుకే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని పాలనా సంస్కరణలు చేసి ఆ తర్వాత మంత్రులకు భాధ్యతల్ని అప్పగిస్తానని, ఇప్పుడే తొందరేమీ లేదని స్పష్టం చేశారట. అయితే ఇప్పటికే కొందరు నేతలకు పదవులపై క్లారిటీ వచ్చిందని కూడా తెలుస్తోంది. కేసీఆర్ నాన్చుడు చూస్తుంటే లోక్ సభ ఎన్నికల తరవాతే పూర్తిస్థాయిలో విస్తరణ ఉంటుందని అనిపిస్తోంది.