నెహ్రు,సోనియా లపై సంచలన వ్యాఖ్యలు చేసిన కెసిఆర్.!

Friday, October 5th, 2018, 06:40:23 PM IST

ఈ రోజు వనపర్తి లోని ప్రజా ఆశీర్వాద సభలోని భాగంగా తెలంగాణా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ అక్కడ ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు.ఈ సభలోని మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కాంగ్రెస్ నాయకులు పాటు పడింది ఏమి లేదని,ఎన్నో కష్టాలు,ఉద్యమాలు తర్వాత మనం తెలంగాణా రాష్ట్రాన్ని సంపాదించుకున్నామని తెలిపారు.అదే సమయంలో జవహర్ లాల్ నెహ్రూ మరియు సోనియా గాంధీల మీద కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సభలో మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రానికి,తెలంగాణా ప్రజలకు పట్టిన భయంకరమైన దరిద్రం కాంగ్రెస్ పార్టీ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.అప్పట్లోనే ఉన్నటువంటి తెలంగాణా రాష్ట్రాన్ని ఊడగొట్టింది జవహర్ లాల్ నెహ్రూ అని,ఇది కథ కాదు చరిత్రలో జరిగిందే చెప్తున్నాని,అసలు తెలంగాణాని ఆంధ్రాలో కలిపింది ఎవరని అది జవహర్ లాల్ నెహ్రు అని అప్పట్లో తెలంగాణా రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన వాళ్ళని అన్యాయంగా చంపేసి తెలంగాణాని ఆంధ్రప్రదేశ్లో జవహర్ లాల్ నెహ్రూ కలిపేశారని మండిపడ్డారు.

1969లో మా రాష్ట్రం మాకు ఇమ్మని అడిగితే 400 మందిని ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇందిరా గాంధీ చంపించారని, ఆ తర్వాత 2004 లో బ్రతిమిలాడినా,వేడుకున్నాసోనియా గాంధీ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మాయలో పడిపోయి మళ్ళీ అన్యాయం చేసిందని మండిపడ్డారు.14 సంవత్సరాలు ఎన్నో ఉద్యమాలు,బలిదానాలు చేసి మనం సాధించుకున్నాం కానీ,వారికి వేరే గత్యంతరం లేకనే ఇచ్చారు అంతే కానీ,తెలంగాణా రాష్ట్రం మీద ప్రేమతో కాదని తెలియజేసారు.