డిసెంబ‌ర్ 7 కేసీఆర్‌కు వ‌ర‌మా షాప‌మా?

Sunday, October 7th, 2018, 09:50:37 AM IST

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన షెడ్యూల్‌ తెలంగాణ ఆప‌ద్ధ‌మ్మ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్‌రావుకు వ‌రంగా మారుతుందా లేక శాపంగా ప‌రిణ‌మిస్తుందా? అని ప్ర‌స్తుతం చ‌ర్చ న‌డుస్తుస్తోంది. పైగా ఏ ప‌ని చేసినా…ప్ర‌తీదానికి జ్యోతిష్య శాస్త్రాన్ని బ‌లంగా విశ్వ‌సించే కేసీఆర్ కు తెలంగాణ ఎన్నిక‌ల కోసం కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన‌ డిసెంబ‌ర్ 7 పెద్ద చిక్కునే తెచ్చిపెట్టిందా? అంటే కొంత మంది రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌ని, కొంత మంది అస‌లు స‌మ‌స్యే కాద‌ని భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నారు.

తెలంగాణ‌లో పోలింగ్ జ‌రిగే డిసెంబ‌ర్ 7 అమావాస్య అవుతోంది. ఆ రోజు జ‌ర‌గ‌బోయే పోలింగ్ ఏ పార్టీ భ‌వ‌త‌వ్యాన్ని చిక‌ట్లో క‌ల‌ప‌నుంది. ఏ పార్టీకి కొత్త వెలుగులు ప్ర‌సాదించ‌నుంద‌ని సోష‌ల్ మీడియాలో ఎవ‌రికి వారు తోచిన విధంగా విశ్లేష‌ణ‌లు మొద‌లుపెట్టారు. అయితే రాజ‌కీయ చ‌ద‌రంగంలో పండిపోయిన కేసీఆర్ మాత్రం కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన తేదీ మాకు అనుకూల‌మే అని చిరున‌వ్వులు చిందిస్తుండ‌టం ప్ర‌తిప‌క్షాల‌కు మింగుడు ప‌డ‌ని ప‌రిస్థితి. ఎన్నిక‌ల షెడ్యూల్ ని అటు ఇటుగా ముందుగానే ప‌సిగ‌ట్టిన కేసీఆర్ ఇప్ప‌టికే 105 స్థానాల‌కు అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించి ప్ర‌తిప‌క్షాల‌కు దిమ్మ‌దిరిగే షాకిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ అమావాస్య త‌రువాత మిగ‌త 14 నియోజ‌క వ‌ర్గాల అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించ‌డానికి సిద్ధ‌ముతున్నారు గులాబీ బాస్‌.

ఈసీ ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించిన వెంట‌నే నియోజ‌క వ‌ర్గాల వారిగా ఆయా మంత్రుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి తుది జాబితాను సిద్ధం చేసిన కేసీఆర్ ఈ నెల 9వ తేదీ త‌రువాత మిగ‌తా జాబితాను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలిసింది. ప్ర‌తికూల వాతావ‌ర‌ణాన్ని కూడా త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌తో తన‌కు అనుకూలంగా మార్చుకోగ‌ల నేర్పరి కావ‌డంతో కేసీఆర్ ఎత్తుగ‌డ‌లు ఎవ్వ‌రికీ మింగుడు ప‌డ‌టం లేదు.