ఇలా ఐతే జగన్ కి పట్టిన గతే మనకి పడుతుంది..కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు.!

Monday, October 22nd, 2018, 10:37:25 AM IST

ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణా రాష్ట్రంలో బాగా బలమైన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా తెరాస పార్టీ అని చెప్పొచ్చు. వారు కూడా అదే ధైర్యంతో ముందస్తు ఎన్నికలకు కూడా దిగారు.దానికి కారం కెసిఆర్ కు తన పార్టీ మీద మరియు తన నేతల మీద ఉన్న నమ్మకం.వేరే ఏ పార్టీకి లేనటువంటి బలం వీరి పార్టీకి ఉంది.అయితే ఇప్పుడు ఈ బలాన్ని,నమ్మకాన్ని గులాబీ నేతలు మరింత అతి విశ్వాసంగా తీసుకుంటున్నారని కెసిఆర్ సర్కార్ కి తెలిసినట్టుంది.

ఇలాంటి కొన్ని ముఖ్యమైన విషయాలపై దిశా నిర్దేశం చెయ్యడానికి నిన్న తెలంగాణా భవన్ లో కెసిఆర్ వారి యొక్క పార్టీ నేతలు అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో హెచ్చరించినట్టు తెలుస్తుంది.తమ పార్టీ నేతలు ఎలాగో గెలుపు మనదే కదాని ధీమాగా ఉంటే కుదరదని,ప్రతీ ఒక్కరు ఈ ఎన్నికలని సీరియస్ గా తీసుకోవాలని అన్నారు.మనకి విశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదని,ఒకవేళ అలా ఉంటే ఆంధ్రాలో జగన్ కి పట్టిన గతే మనకి పడుతుందని కెసిఆర్ వారి పార్టీ నేతలను అభ్యర్థులను హెచ్చరించారని తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments