టీఆర్ఎస్ స‌ర్వే .. అదో డ‌మ్మీ కంపెనీ ప‌ని?!

Sunday, September 16th, 2018, 11:00:14 AM IST


తెలంగాణ‌లో మ‌రోసారి కేసీఆర్ ముఖ్య మంత్రి అవుతార‌ని స‌ర్వే చేసి చెప్పింది విడిపి అస్సోసియేట్స్ అనే ఓ ప్ర‌యివేటు ఏజెన్సీ. ఈసారి ఎన్నిక‌ల్లో టీఆర్‌ఎస్‌కి 80 సీట్లు, కాంగ్రెస్‌కి 20 సీట్లు, బీజేపీకి 7, ఇత‌రుల‌కు 12 సీట్లు వ‌స్తాయి అంటూ లెక్క తేల్చింది. అయితే స‌ద‌రు ఏజెన్సీ చెప్పిన‌ది నిజ‌మా? అస‌లు ఆ ఏజెన్సీకి విశ్వ‌నీయ‌త ఎంత‌? అని గూగుల్‌లో వెతికితే దిమ్మ‌తిరిగే నిజం తెలిసొచ్చింది.

అస‌లు ఇంత‌వ‌ర‌కూ ఈ కంపెనీకి వీకీపెడియాలో మినిమం ఒక పేజీ అయినా లేదు. క‌నీసం స‌ద‌రు కంపెనీకి సొంతంగా వెబ్‌సైట్ అయినా ఉందా? అంటే అదీ లేదు. విడిపిఅసోసియేట్స్ డాట్ కాం (vdpassociates.com) అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే క‌నీసం వెబ్‌సైట్ అయినా లేద‌ని తేలిపోయింది. అంటే ఇదేదో కేసీఆర్ పెట్టుబ‌డుల‌తో డ‌మ్మీ స‌ర్వే చేసిన కంపెనీ అనే అనుకోవాలా? కంప్యూటర్‌లో ఆర్ట్ వర్క్ చేసి జనం మీదకి వదిలితే దానిని సర్వే అంటారా? టీవీల్లో ఊదరగొడుతున్న సర్వేను వీడీపీ సంస్థ చేసిందంటూ ఊద‌ర‌గొట్టేస్తున్నారు. దీని చరిత్ర, విశ్వసనీయత గురించి గూగుల్‌ని అడిగితే జీరో ఆన్సర్ వచ్చింది. కనీసం వికీపీడియాలోనూ ఈ సంస్థ చరిత్ర దొరక్క‌పోవ‌డం హాస్యాస్ప‌దంగా మారింది. దీనిని బ‌ట్టి ఈ డ‌మ్మీ లెక్క‌ను రాంగ్ అని జ‌నం అర్థం చేసుకునే ప్ర‌మాదం ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments