సమ్మె చేస్తే ఇదే చివరిది అవుతుంది: కేసీఆర్ హెచ్చరిక

Friday, June 8th, 2018, 08:20:33 AM IST


తెలంగాణ ఆర్టీసీ యూనియన్లు ప్రస్తుతం సమ్మె కోసం సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. సమస్యలను వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ.. సీఎం కేసీఆర్ కు నోటీసులు పంపించారు. దీంతో ఈవిషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రగతి భవన్‌లో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి సమ్మె విరమించుకోవాలని హెచ్చరిక జారీ చేశారు.

కావాలని ప్రభుత్వం మీద బురదజల్లడానికి ప్రయత్నాలు చేస్తున్న నాయకుల మాటలను నమ్మవద్దని చెప్పారు. సమ్మె చేయడాన్ని నిషేధించినా కూడా కొందరు స్వార్థం కోసం నోటీసులు పంపించారు. యూనియన్ నాయకులు ఆర్టీసీని ముంచే ప్రయత్నం చేస్తున్నారు. వారి మాటలకు మోసపోకండి. వెంటనే సమ్మె విరమించుకోవాలి. అనవసరంగా ఉద్యోగాలు పోగొట్టుకోవద్దని కేసీఆర్ హెచ్చరిక జారీ చేశారు.

ఆర్టీసీ పరిస్థితి గురించి వివరిస్తూ.. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఏడాదికి 700 కోట్లతో నష్టం కలుగుతోంది. ఇప్పుడు 1400 కోట్ల భారం పడేలా సమ్మె చేయడం బాధ్యతరహిత్యానికి ప్రత్యేక నిదర్శనం. తెలంగాణలో ఉన్నది కేవలం 53వేల ఆర్టీసీ కార్మికులే కాదు. నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న సంగతిని గుర్తించాలని సమ్మెకు వెళితే ఇదే చివరి సమ్మె అవుతుందని కేసీఆర్ తెలియజేశారు. ఇక సమ్మె మొదలైతే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని చెబుతూ.. పదవి విరమణ డ్రైవర్ల సేవలను వినియోగించుకొని ఇతర సంస్థల నుంచి బస్సులను అద్దెకు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

  •  
  •  
  •  
  •  

Comments