నో టికెట్.. బాబు మోహన్ కి షాకిచ్చిన కేసీఆర్!

Thursday, September 6th, 2018, 09:26:03 PM IST

కేసీఆర్ దూకుడుకు ప్రతిపక్షాల గుండెల్లో కాస్త గుబులు మొదలైందని కామెంట్స్ గట్టిగానే వస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని గత కొన్ని నెలల నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్న కేసీఆర్ ఇప్పుడు అందరికంటే ముందే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి షాకిచ్చారు. దీన్ని బట్టి ఎన్నికల కోసం టీఆరెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పకనే చెప్పింది. అయితే పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ షాకిచ్చారు. ముఖ్యంగా బాబు మోహన్ కి టికెట్టు దక్కకపోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

గత ఎన్నికల్లో ఆంథోల్ నియోజకవర్గంలో టీఆరెస్ పార్టీ తరపున పోటీ చేసిన బాబు మోహన్ 3,291 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బాబు మోహన్ కి గట్టి పోటీని ఇచ్చారు. అయితే ఇటీవల బాబు మోహన్ పలు వివాదస్పదల కారణంగా వార్తల్లో నిలవడంతో విమర్శలు వెలువడ్డాయి. దీంతో ఆయనను కాదని కేసీఆర్ స్థానిక సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి కుమార్ ను ఆంథోల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. రీసెంట్ గా ప్రగతి నివేదన సభ కోసం నిర్వహించిన ర్యాలీలో సొంత పార్టీ కార్యకర్తపై బాబు మోహన్ కాలెత్తడం యొక్క వీడియో కూడా వైరల్ అయ్యింది.

  •  
  •  
  •  
  •  

Comments