తెలంగాణ వస్తే చిమ్మ చీకటైపోతుందని అన్నారు: కేసీఆర్

Sunday, September 2nd, 2018, 07:59:09 PM IST

టీఆరెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మరోసారి తన బలాన్ని ప్రగతి నివేదన సభతో నిరూపించుకుంది. దాదాపు 25 లక్షల మందికిపైగా జనాలతో గులాబీ పార్టీ దళం ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక కేసీఆర్ తన స్పీచ్ తో మరోసారి అందరిని ఆకట్టుకున్నారు. ఇప్పటివరకు అమలు చేసిన పథకాలను తనదైన శైలిలో వివరించారు. అదే విధంగా 24 గంటల కరెంటు గురించి కూడా కేసీఆర్ వివరించారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ చిమ్మ చీకటవుతుందని ఆనాడు సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని కానీ తెలంగాణ వచ్చిన అనంతరం మంచి ప్లానింగ్ తో 24 గంటల కరెంటును సాధించుకున్నామని అందుకు విద్యుత్ ఉద్యోగుల కృషికూడా ఉందని కేసీఆర్ తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం దేశంలో రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. ఇక ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలు అన్ని అబద్ధాలని ప్రాజెక్టులను నిర్మిస్తుంటే అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments