ఈ సారి నా టార్గెట్ 100 సీట్లు..కెసిఆర్..!

Monday, October 22nd, 2018, 02:29:29 PM IST

తెలంగాణా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికలకు ఇంకా తక్కువ సమయమే మిగిలి ఉండటంతో తన కార్యకర్తలకు మరియు తమ పార్టీ తరపున విడుదల చేసిన అభ్యర్థులు అందరికి నిన్న తెలంగాణా భవన్ లో జరిగినటువంటి మీటింగులో దిశా నిర్దేశం చేశారు.ఇప్పటికే తమ పార్టీ బలంగా ఉందని అందరికి తెలుసు అలా అని చెప్పి తెరాస నాయకులు మాత్రం బాధ్యతారాహిత్యంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తే బాగుండదని కూడా కెసిఆర్ వారికి హెచ్చరికలు చేశారు.దాని వల్ల వారి పార్టీ భవిష్యత్తులో దెబ్బ తినే అవకాశం ఉందని,అలాంటి పరిస్థితి మనం తీస్కొచ్చుకోకూడదని కెసిఆర్ వారికి తెలిపారు.

అదే సందర్భంలో ఇప్పటికే తన పార్టీ నుంచి ఈ అభ్యర్థులే పోటీ చేస్తున్నారని ఒక జాబితాను కూడా విడుడల చేశారు.అయితే 105 మంది అభ్యర్థులు ఉన్నటువంటి ఈ జాబితాలో 100 సీట్లను ఎట్టి పరిస్థితిలోను మనం గెలిచి తీరాలని కెసిఆర్ వారికి దిశా నిర్దేశం చేశారు.ఎట్టి పరిస్థిల్లోనూ ఈ లెక్కల్లో ఎలాంటి మార్పులు రాకూడదని కెసిఆర్ తెలిపినట్టు తెలుస్తుంది.ఇప్పటికే బలమైన పార్టీ కొంత మంది అభ్యర్థుల్లో ఉన్నటువంటి లోటు పాట్లను కెసిఆర్ సవరించగలిగినట్టయితే వీరు గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments