కేసీఆర్ గుట్టు లీక్‌.. ఇక జాతీయ‌మే!!

Saturday, November 10th, 2018, 10:30:41 AM IST

నిత్యం కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హిస్తూ వార్త‌ల్లో నిలుస్తుంటారు తెలంగాణ యువ నేత కేటీఆర్‌. ఆయ‌న వ్య‌వ‌హార శైలి అంటే చాలా మంది నేత‌లు ఇష్ట‌ప‌డుతుంటారు. అలాంటి ఆయ‌న తెలంగాణ ఎన్నిక‌ల వేళ త‌న తండ్రి కేసీఆర్ గుట్టును ఓ జాతీయ ఛాన‌ల్ వేదిక‌గా బ‌హిర్గ‌తం చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఈ మ‌ధ్య జాతీయ వార్త చాన‌ల్ సీఎన్ఎన్- న్యూస్ 18 చాన‌ల్ కేటీఆర్‌ను ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ చేసింది. ఈ ఇంట‌ర్వ్యూలో కేటీఆర్ ప‌లు ఆస‌క్తిక‌ర వివిరాల్ని వెల్ల‌డించారు. ఈ ఎన్నిక‌ల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో తెరాస గెలుస్తుంద‌ని, ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి మాకు ఎవ‌రి పొత్తు అవ‌రం లేద‌ని ధీమాను వ్య‌క్తం చేశాడు. తెరాస‌కు తెలంగాణ ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు వుంద‌ని, కూట‌మిని వారే చిత్తుచిత్తుగా ఓడిస్తార‌ని, కూట‌మి నాయ‌కుల‌కు కొన్ని చోట్ల డిపాజిట్‌లు కూడా ద‌క్క‌వ‌ని తేల్చి చెప్పారు. దేశ పాల‌న‌లో కాంగ్రెస్‌, బీజేపీ విఫ‌ల‌మ‌య్యాయ‌ని, అందుకే మా నేత కేసీఆర్ జాతీయ రాజ‌కీయ‌ల్లో ప్ర‌త్యామ్న‌య కూట‌మి దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టేశారు.

ప్ర‌స్తుతం తెలంగాణ ఎన్నిక‌ల‌పైనే ప్ర‌త్యేక దృష్టి పెట్టామ‌ని, జ‌న‌వ‌రి త‌రువాత జాతీయ రాజ‌కీయ‌ల‌పై దృష్టిపెడ‌తామ‌ని స్ఫ‌ష్టం చేశారు. జాతీయ రాజ‌కీయాల్లో జ‌న‌వ‌రి త‌రువాత విప్ల‌వాత్మ‌క మార్పులు చోటుచేసుకుంటాయ‌ని. అవేంటో ఇప్పుడు చెప్ప‌లేన‌ని తెలిపి కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై అస‌లు గుట్టు విప్పడం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని క‌లిగిస్తోంది. కేంద్రంతో స‌మానంగా రాష్ట్రాలు అభివృద్ధి బాట ప‌ట్టాలి. అది జ‌ర‌గ‌డం లేదు. దీని కోస‌మే మా నేత స‌హ‌కార స‌మాఖ్య నినాదాన్ని అందుకున్నార‌ని, ఇది త్వ‌ర‌లో అంద‌రూ అందుకుంటార‌ని కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌వైపు వెళ‌తార‌నే సంకేతాల్ని అందించారు. అంటే డాడ్ జాతీయ నేత అయితే, కేటీఆర్ తెలంగాణ‌కు సీఎం అవుతున్నార‌న్న‌మాట‌!!

  •  
  •  
  •  
  •  

Comments