టీఆరెస్ నేతలకు కేసీఆర్ స్వీట్ వార్నింగ్!

Tuesday, July 24th, 2018, 09:11:11 AM IST

తెలంగాణ రాజకీయాల్లో ఎన్ని రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చిన కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆరెస్ పార్టీని ఓడించలేదని అందరికి తెలిసిందే. ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఇంకా బలహీనపడుతుండడం టీఆరెస్ కి కలిసొచ్చే అంశమే. కాంగ్రెస్ లో ఇంకా గ్రూపు రాజకీయాల వివాదాలు తగ్గలేదు. ఇంకా పార్టీ టికెట్ ఫిక్స్ చేయకముందే నియోజకవర్గ ఎంపిక విషయంలో వివాదాలు చెలరేగుతున్నాయి. ఇటీవల సీనియర్ నేతల మధ్య మాటల యుద్ధం పార్టీపై నెగిటివ్ కామెంట్స్ ను రప్పించిందని చెప్పవచ్చు.

రాహుల్ గాంధీ ఈ విషయంపై చాలా సీరియస్ అయ్యాడు. గొడవలు పడితే పార్టీలో నుంచి బహిష్కరించడమే కరెక్ట్ అని ఇటీవల చాలా మందికి వార్నింగ్ ఇచ్చారు. ఇకపోతే ప్రస్తుతం కేసీఆర్ పార్టీలో కూడా నేతల మధ్య గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయని టాక్ వస్తోంది. పలు జిల్లాల్లో నేతలు పార్టీ టికెట్ కోసం కార్యకర్తల మద్దతును ఒక వైపు అందుకొని సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తుండడంతో కేసీఆర్ ఇటీవల సీరియస్ అయ్యారు.

ప్రతి నియోజకవర్గ పార్టీ అధ్యక్షులకు ఇప్పటికే కొన్నిసార్లు హెచ్చరికలు జారీ చేశారు. పార్టీలో ఎలాంటి అంతర్గత యుద్దాలు ఉండకూడదని అలాంటి గ్రూపు రాజకీయాలు ఏమైనా ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎలక్షన్స్ లో వీలైనంత వరకు అన్ని సీట్లను దక్కించుకోవాలని అనుకుంటున్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడని నేతలను పట్టించుకునేది లేదని కేసీఆర్ చెప్పడంతో నేతలు కూడా విషయాన్నీ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments