ఆ 15 మంది నేతల గెలుపుపై డౌట్.. కేసీఆర్ హెచ్చరిక!

Sunday, September 9th, 2018, 01:13:32 PM IST

కొత్త రాష్ట్రం తెలంగాణాలో మరో రాజకీయ యుద్ధం స్పీడ్ గా వచ్చేసింది. ఈ పోటీల్లో మరోసారి తెలంగాణ తన పట్టు నిలుపుకోవాలని కష్టపడుతోంది. గత ఎన్నికల్లో చాలా మంది నేతలు టీఆరెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అందులో కొంత మందికి మంచి పదవులే దక్కాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దాదాపు అందరికి పార్టీ కు తరపున టికెట్టు లభించింది. కేసీఆర్ ప్రకటించిన 105 అభ్యర్థులు తప్పకుండా గెలుస్తారనే అవకాశం ఉన్నట్లు పార్టీ అదిష్టానం ధీమా వ్యక్తం చేస్తోంది.

అయితే ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో 10 నుంచి 15 మందికి ఇచ్చిన టికెట్లు డౌటే అనే అనుమానం వస్తోంది. కేసీఆర్ వారికి ముందే హెచ్చరిక జారీచేసినట్లు తెలుస్తోంది. వీలైతే సభ్యులను మార్చే అవకాశం కూడా ఉన్నట్లు టాక్. సీనియర్ నాయకులచేత నిర్వహించ సర్వేలో ఆ 15 మంది నాయకులు ఈ సారి గెలిచే అవకాశాలు అంత మెరుగ్గా లేవని తేలింది. ఆ లిస్టులో ప్రధానంగా (శంకర్ నాయక్) మహబూబా బాద్, రేఖ నాయక్(ఖానాపూర్), యాదగిరి రెడ్డి (జనగామ) పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ఉన్న వ్యతిరేకతను వీలైనంత త్వరగా సాల్వ్ చేసుకొని జనాలను ఆకర్షించాలని చెప్పారట.

దీంతో కేసీఆర్ వారితో ముందుగానే చర్చలు జరిపి మరో అవకాశాన్ని ఇస్తున్న.. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా బలాన్ని పెంచుకోవాలని పార్థి అధినేత తెలిపినట్లు సమాచారం. మరో నెల రోజుల్లో సర్దుబాటు చేసుకొని ఎన్నికలకు సిద్ధమవ్వాలని లేకుంటే కఠిన నిర్ణయాలు ఉంటాయని వివరించారట. ఇక పార్టీ నుంచి టికెట్టు అందని నాయకులను బుజ్జగించే పనిలో పడ్డారు టీఆరెస్ అధినేతలు. మిగిలిన 14 స్థానాల అభ్యర్థులను కూడా వెల్లడించాల్సి ఉండగా ప్రస్తుతం కేసీఆర్ అధిష్టానం ఆ పనిలో నిమగ్నమైంది.

  •  
  •  
  •  
  •  

Comments