డేంజర్ జోన్ లో 39 మంది టీఆరెస్ ఎమ్మెల్యేలు.. కేసీఆర్ వార్నింగ్!

Thursday, June 7th, 2018, 08:57:56 AM IST

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీఆరెస్ పార్టీ ఎంత బలంగా ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పదేళ్ల వరకు ఆ పార్టీ అధికారం నుంచి తప్పుకోదని డైరెక్ట్ గా ప్రతిపక్ష నాయకులే కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. విమర్శలకు ఎప్పటికప్పుడు బదులిస్తూ మంచి పాలనతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ప్రతి పండగలకు ఆయా వర్గాల వారిని ఆకర్షించే విధంగా పథకాలను ఇస్తున్నారు. అయితే రీసెంట్ గా కొంత మంది పని తీరు వల్ల ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

దాదాపు 39 మంది టీఆరెస్ నేతలు డేంజర్ జోన్ లో ఉన్నారట. వారందరికీ కేసీఆర్ నుంచి వార్నింగ్ వెళ్లినట్లు సమాచారం. గత కొంత కాలంగా నీదుల విషయంలో అలాగే అభివృద్ధి విషయంలో అవకతవకలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో నేతల పనితీరు మరి దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ టీఆరెస్ చాలా బలంగా. కేసీఆర్ ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా ప్రతి ఎమ్మెల్యే కాన్సిస్టెన్సీ గురించి తెలుసుకుంటున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ లో గెలవడానికి వారి పనితనం వల్లే సాధ్యమని వర్క్ కరెక్ట్ గా చేయకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రజలు గెలిపించారని చెప్పారట. ఇక అనుమానం ఉన్న స్థానాల్లో ఎమ్మెల్యేలకు ఈ సారి పార్టీ నుంచి టికెట్ అందడం కష్టమే అని టాక్. కేసీఆర్ – కేటీఆర్ కి సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలతో ఇప్పటికే కేసీఆర్ సమీక్ష నిర్వహించి వారి సన్నిహిత ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇప్పించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎలక్షన్స్ లోపు పరిస్థితిని మెరుగుపరచుకోవాలని లేకుంటే ఎవరు కాపాడలేరని కేసీఆర్ నాయకులకు తెలిపారని సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments