గజ్వెల్ లో నామినేషన్ వేసిన కెసిఆర్

Thursday, November 15th, 2018, 12:31:50 AM IST

డిసెంబర్ 11న జరిగే ఎన్నికల్లో పోటీ కోసం తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కోనాయిపల్లి వెంకన్న దర్శనం అనంతరం మంత్రి హరీష్ రావు, అనుచరులతో కలిసి కేసీఆర్ గజ్వేల్ చేరుకున్నారు. ఊరేగింపుగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

అనుకున్న ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 2.34 గంటలకు కెసిఆర్ నామినేషన్ దాఖలు చేశారు. డిసెంబరు 7న ఎన్నికల నేపథ్యంలో బి-ఫారాలు అందుకున్న టీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఎక్కువ మంది బుధవారమే నామినేషన్ దాఖలు చేస్తుండటం గమనార్హం. 14 తేదీ దాటితే మళ్లీ నామినేషన్లకు చివరి రోజైన 19వ తేదీయే మంచి రోజు. అయితే, మహాకూటమిలో ఇంకా సీట్ల పంపకంలో స్పష్టత రాకపోవడంతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలులో వెనుకబడ్డారు. జాబితాలో పేర్లు ఖరారైన కొంతమంది అభ్యర్థులు బి-ఫారాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…