కేసీఆర్ అంతు చూసే ప‌త్రిక‌!

Sunday, May 6th, 2018, 01:08:15 PM IST

`నమస్తే తెలంగాణ` ప‌త్రికను తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌ల‌వంతంగా లాక్కున్న సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి ఆ ప‌త్రిక ప్రారంభానికి కార‌కుడు సి.ఎల్‌.రాజం. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర‌ధారిగా రాజం ఎంతో క‌ష్ట‌ప‌డినా, ఆ క్రెడిట్ మొత్తం కేసీఆర్‌కే వెళ్లింది. ఉద్య‌మానికి ముందు, `న‌మ‌స్తే తెలంగాణ` దిన‌ప‌త్రిక‌ ఎండీగా కొన‌సాగిన రాజంను కేసీఆర్ బ‌లవంతంగా బ‌య‌ట‌కు గెంటేశారు. ఇలా అధికారంలోకి వ‌చ్చాడో లేదో అలా సీఎం కేసీఆర్ దాష్ఠీకానికి పాల్ప‌డ‌డం అప్ప‌ట్లో అంతటా చ‌ర్చ‌కొచ్చింది. ఆ క్ర‌మంలోనే రాజం మైండ్‌లో వ‌చ్చిన ఆలోచ‌నే కొత్త ప‌త్రిక పెట్ట‌డం. అనుకున్న‌దే త‌డ‌వుగా ఆయ‌న `విజ‌య‌క్రాంతి` దిన‌ప‌త్రిక‌ను ప్రారంభించారు. ఈ ప‌త్రిక తెలంగాణ రాష్ట్రంలో ఓ పెను స‌వాల్ కానుంది. కేసీఆర్ వేసే ప్ర‌తి అడుగును ప్ర‌శ్నించ‌నుంది. అత‌డి ప్రజా వ్య‌తిరేక విధానాల్ని దూకుడుగా ప్ర‌శ్నించేందుకు, ప్ర‌జ‌ల త‌ర‌పున వ‌కాల్తా పుచ్చుకోనుంది. నిన్న‌టిరోజున హైద‌రాబాద్ మ్యారియ‌ట్లో ప‌త్రిక ప్రారంభోత్స‌వం కేంద్ర మంత్రి నితిన్ ఘ‌ట్క‌రీ సార‌థ్యంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా

సి.ఎల్‌.రాజం మాట్లాడుతూ -“న‌మ‌స్తే తెలంగాణ` అనే బ్రహ్మాస్త్రాన్ని తీసుకొస్తే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరింది. రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మళ్లీ మరో పత్రిక అనివార్యమైంది. అందుకే `విజయక్రాంతి` అనే నారాయణాస్త్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించే వాళ్లంతా ఇది నా పేప‌రు అని గ‌ర్వించేలా తీర్చిదిద్దుతాను“ అని అన్నారు. మ‌రిన్ని విష‌యాలు మాట్లాడుతూ-“నేను పత్రిక పెడుతున్నా అని చెబితే నా మిత్రులు, శ్రేయోభిలాషులు 5, 6 ప్రశ్నలు నా ముందుంచారు. పేపర్ పెట్టడం సోషల్ సర్వీస్. ఇది అవసరమా? దీనిమీద వచ్చేదేమీ లేదు. అనవసరంగా డబ్బెందుకు ఖర్చు పెడతావ్. బ్యాంకులో పెట్టుకున్నా హాయిగా బతకొచ్చు కదా! అని సలహా ఇచ్చారు. కానీ వాళ్లకు నేనొక్కటే చెప్పిన. ‘నా వయస్సు 66 ఏళ్లు. డబ్బు నాకు ప్రధానం కాదు. సమాజ సేవ నాకు ముఖ్యం. చాలా మంది దగ్గర వేల కోట్లున్నాయి. తెలంగాణ కోసం పేపర్ అవసరమున్నా ఎవరూ ముందుకు రాలేదు. నా దగ్గర వందల కోట్లు మాత్రమే ఉన్నాయి. నేను నా లీడర్‌షిప్‌తో ఆనాడు నమస్తే తెలంగాణ పత్రిక ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని నా భుజాన మోశాను. రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష నెరవేరింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినయ్. మళ్లీ ఇప్పుడు పత్రిక అవసరం ఉంది. అందుకే విజయక్రాంతి ద్వారా మీ వస్తున్న“ అని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పత్రికలు రెండు రకాలు. వాటిలో ఒకటి పార్టీ పత్రికలు కాగా రెండోది ప్రభుత్వానికి చెంచాగిరి చేసేవి. కానీ నా పత్రిక అలా ఉండ‌ద‌ని సూటిగా చెప్పారు. కేసీఆర్ త‌ర‌వాత అంత‌టి స్టామినా ఉన్న సి.ఎల్‌.రాజం ఈ ప‌త్రిక‌తో ఎన్నో సంచ‌ల‌నాల‌కు తెర‌తీయ‌నున్నార‌నడంలో సందేహ‌మే లేదు. సీ.ఎల్‌.రాజం ఈ ప‌త్రిక‌ను విజ‌య‌వంతంగా న‌డిపించ‌గ‌ల‌రా? వెన‌క ఎవ‌రైనా నిలిచారా? అంటే ఆయ‌నొక్క‌డే 100 కోట్ల ఆస్తిప‌రుడు. స్థితిమంతుడు. ఆ విష‌యాన్ని ఆయ‌నే ప‌త్రిక ఆరంభం వేళ స‌భా వేదిక సాక్షిగా అంగీక‌రించారు. సీ.ఎల్‌.రాజం ది గ్రేట్ ఇండ‌స్ట్రియ‌లిస్ట్ ఇన్ తెలంగాణ‌.

  •  
  •  
  •  
  •  

Comments