కేసీఆర్ నుంచి కొత్త ప‌త్రిక‌?

Wednesday, December 28th, 2016, 06:00:04 PM IST

kcrr
సీఎం కేసీఆర్ దూకుడు చూస్తుంటే సునామీలా క‌నిపిస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఇప్ప‌టికే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న సీఎం.. సొంత ప్ర‌మోష‌న్ కోసం విచ్చ‌ల‌విడిగా మీడియాని వాడుకుంటున్నార‌న్న ప్ర‌చారం ఉంది. ఇప్ప‌టికే న‌మ‌స్తే తెలంగాణ‌, టీన్యూస్‌ల‌తో పాటు తెలంగాణ టుడే వంటి ఆంగ్ల ప‌త్రిక‌ను ఆయ‌న ర‌న్ చేస్తున్నారు. ఇటీవ‌లే ఈ ఆంగ్ల దిన‌ప‌త్రిక మొద‌లైపోయింది. అయితే కేసీఆర్ మీడియా దాహం ఇంకా ఇంకా పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేద‌ని చెప్పుకునేలా ఆయ‌న క‌న్ను ఇప్పుడు ఉర్దూపై ప‌డిందిట‌.

ఊర్దూ పాఠ‌కులే ల‌క్ష్యంగా.. ఆయ‌న ‘అజాద్‌ తెలంగాణ’ పత్రికను ప్రారంభించోతున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇత‌ర ఉర్దూ ప‌త్రిక‌లు.. `సియాసత్‌`, `ఇత్తేమాద్‌`లో పనిచేస్తున్న సీనియర్‌ జర్నలిస్టును ఈ కొత్త ప‌త్రిక‌కు ఎడిటర్‌గా నియమించిన‌ట్టు తెలుస్తోంది. కేసీఆర్ మీడియాలు ప్ర‌స్తుతం ఓవ‌రాల్ మీడియాలో హాట్ టాపిక్‌.

  •  
  •  
  •  
  •  

Comments