విజ‌య‌సాయిరెడ్డి : కేంద్ర బ‌ల‌గాల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈవీఎంల‌ను ఉంచాలి..!

Tuesday, April 16th, 2019, 12:00:17 AM IST

వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల బృందం ఢిల్లీలోని కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారుల‌ను క‌లిసింది. ఏప్రిల్ 11న జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వివిధ జిల్లాలో అరాచ‌కాలు సృష్టించార‌ని ఎన్నిక‌ల సంఘానికి వైసీపీ నేత‌లు ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ ఎన్నిక‌ల సంఘం నియ‌మావ‌ళిని ఉల్లంఘిస్తున్న వైనాన్ని కూడా వైసీపీ నేత‌లు ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకొచ్చారు.

అలాగే ఈవీఎంలు భ‌ద్ర‌ప‌రిచిన స్ట్రాంగ్ రూముల‌కు కేంద్ర బ‌ల‌గాల‌తో ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు. రాష్ట్రంలో ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వం చేస్తున్న కొత్త అప్పును, ఖ‌ర్చుల‌ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఈసీని క‌లిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల బృందంలో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డితోపాటు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, వేమిరెడ్డి, బాలశౌరి, సీ.రామ‌చంద్ర‌య్య‌, బుట్టా రేణుక‌, అవంతి శ్రీ‌నివాస్ త‌దిత‌రులు ఉన్నారు.