లేడీ ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన హీరోయిన్..!

Thursday, December 6th, 2018, 03:51:22 PM IST

మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసిందా అనేంతలా నటించి తెలుగు వారి మనసులు గెలుచుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. నటించిన మొదటి సినిమా నేను శైలజాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన కీర్తి తర్వాత నేను లోకల్, మహానటి సినిమాల ద్వారా మరింత దగ్గరైంది. ఆమె నటించిన పందెం కొడి2, సర్కార్ చిత్రాలు తమిళ్ లో భారీ విజయాలు సాధించాయి, తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి వసూల్లు రాబట్టాయి. కొన్నాళ్లపాటు హీరోలతో జత కట్టే పాత్రలే చేసిన కీర్తి, ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సైతం చేయడానికి రెడీ అంటోంది.

తాజాగా కీర్తి సురేష్ ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాణంలో తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. లేడీ ఓరియెంటెడ్ కథతో ఆ సినిమా ఉండబోతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా దర్శకుడు ఎవరు అన్నది ఇంకా ఫైనలైజ్ కాలేదు. దర్శకుడు ఎవరన్నది, ఇతరత్రా వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు. ఏది ఏమైనా కీర్తి సురేష్ ఓకే చేసిందంటే ఆ కథలో మంచి కంటెంట్ ఉంటుందన్నమాట.