మహానటికి కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే !

Monday, May 7th, 2018, 08:07:11 PM IST

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మహానటి. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సంస్థ పై ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మిస్తున్నారు. కాగా సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో సావిత్రి పాత్రకు సరిపోయే నటి కోసం అశ్విన్ అండ్ టీం చాలానే వెతికారట. చివరికి కీర్తి సురేష్ అయితే అచ్చం సావిత్రిలా ఉంటుందని ఆమెను ఎంచుకున్నారు. మొదట్లో ఆమెవద్దకు వెళ్ళి ఈ చిత్రాన్ని చేయమని అడిగితే ఆమె చేయలేనని నిరాకరించినట్లు కీర్తి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

నిజానికి అంతటి మహానటి పాత్రలో నటించడం అలవికానిదని, అందుకే తొలుత కొంత భయపడి వద్దు అని చెప్పాను అన్నారు. అయితే ఆ తరువాత ప్రియాంక, స్వప్న, అశ్విన్ తాను మాత్రమే ఈ పాత్ర చేయగలనని నచ్చచెప్పి ఒప్పించారట. అయితే ఎప్పుడైతే ఈ చిత్రం ఫస్ట్ లుక్ లో అందరూ కీర్తి ని చూసారో, ఆ సమయంలో ప్రతిఒక్కరి నోటినుండి వచ్చింది ఒకే ఒక్కమాట. కీర్తి అచ్చం సావిత్రిగారు లానే ఉందే అని. అయితే ఈ చిత్రం చేసేటపుడు సావిత్రిగారి తాలూకు ఆహార్యాన్ని అచ్చం ఆమెలానే ప్రదర్శించడం చాలా కష్టమయిందని, ఆమె సహజనటి అని కీర్తి అన్నారు.

కాగా ప్రస్తుతం ఈ చిత్రంలో నటించిన కీర్తి సురేష్ కి సంబందించిన ఒక వార్త టాలీవుడ్ లో తెగ హాల్ చల్ చేస్తోంది. అది ఏమిటంటే ఈ చిత్రంలో కీర్తిని నటింపచేయడానికి అశ్విన్ బృందం చాలా శ్రమపడవలసి వచ్చిందని, అంతకంటే ముఖ్యంగా ఆమెకు ఈ చిత్రానికి ఏకంగా ఒకటిన్నర కోటి రూపాయల పారితోషికం ముట్టచెప్పవలసి వచ్చిందని అంటున్నారు. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదుకాని, కీర్తి అందుకున్న ఈ మొత్తం చూస్తే అమ్మడు అప్పుడే టాలీవుడ్ అగ్రనటీమణులైన సమంత, అనుష్క, కాజల్ ల స్థాయి పారితోషికం అందుకున్నట్లేనని అంటున్నారు…..