మోడీపై కేజ్రీ వాల్ పరోక్ష విమర్శలు!

Thursday, May 31st, 2018, 02:00:35 PM IST

ఢిల్లీ ముఖ్య మంత్రి ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీ వాల్ భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన కొన్ని పరోక్ష వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. కాగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చదువుకోలేదని, ఆయన డిగ్రీ పాసయినట్లు చూపుతున్న డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదని ఇదివరకు తీవ్రంగా విమర్శించిన కేజ్రీ వాల్, గత భారత ప్రధాని మన్మోహన్ సింగ్ వంటి విద్యావంతుడైన వ్యక్తి ప్రధానిగా ఉంటే దేశానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. అసలు విషయం ఏమిటంటే మన దేశ రూపాయి పతనం కావడంతో అది దేశీయ పెట్టుబడులపై ఎటువంటి పెను ప్రభావం చూపుతుంది అనే విషయమై ఒక ఆంగ్ల పత్రిక ఇటీవల ఒక కథనాన్ని ప్రచురించిగా, కేజ్రీ వాల్ ఆ కథనం తాలూకు ఫోటోలను తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ మోడీపై విమర్శల దాడి చేసారు.

ఇలాంటి ఆర్ధిక సమస్యలు కేవలం దేశాధినేతలు విద్యావంతులు కాకపోవడం వల్లనే వస్తాయని, అదేకనుక ప్రధాని స్థాయి వ్యక్తి మంచి మేధావి అయి ఉంటే ఇటువంటి సమస్యలకు తన తెలివితో అడ్డుగాకట్టా వేసేవారు అనేది ఆయన ఉద్దేశం. దీన్నిబట్టి ఆయన చెప్పేదేమిటంటే, మోడీ కంటే మన్మోహనే మంచి చదువుకున్న మేధావి అనేది ఆయన ఉద్దేశం అని అంటున్నారు. మోడీ నేతృత్వంలోని బిజెపి దేశప్రజలను ఆర్ధికంగా స్థితిమంతులు చేసేవిధంగా పాలన చేపడుతున్నారని ఆ పార్టీ నేతలు డప్పులు కొట్టుకుంటున్నారు. నిజానికి ప్రజల ఆర్ధిక పరిస్థితి ఏమి బాగోలేదని, కావున భారతీయులు ఇది గ్రహించి రానున్న ఎన్నికల తర్వాత మన్మోహన్ వంటి చదువుకున్న వ్యక్తికి పట్టంకడితే మంచిదని అనుకుంటున్నట్లు చెప్పారు.

అయితే ఇందులో ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వున్నపుడు ఇదే కేజ్రీవాల్ అప్పటి ప్రధాని మన్మోహన్ ను తీవ్ర స్థాయిలో విమర్శించి ఆయన్ను ఒక దృతరాష్ట్రుడితో పోల్చిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్ బీజేపీపై అలానే మోడీ పాలన పై అక్కసుతో ఇలా విమర్శలు చేస్తున్నారని, మరొక్కమారు ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలే ఆప్ పార్టీకి అసలేం కేజ్రీవాల్ కి తగిన బుద్ధి చెపుతారని హెచ్చరించారు……