పంజాగుట్ట పోలిస్ స్టేషన్లో ముఖ్యమంత్రి

Thursday, April 19th, 2018, 05:18:42 PM IST

తెలంగాణా రాష్ట్రం పర్యాటక ప్రదేశాలకే కాకుండా అభివృద్దికి కూడా మారుపేరుగా మారుతుంది. ప్రతీ విభాగంలో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ ఎప్పటికప్పుడు టేక్నాలజీకనుగునంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీసు విభాగం కూడా దేశంలో అన్ని రాష్ట్రాలతో పోటీ పడుతూ అభివృద్ధి దిశల వైపుకు పరుగులిడుతుంది. అయితే తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ గురువారం హైదరాబాద్ కు వచ్చి మధ్యాహ్నం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ అవార్డును పంజాగుట్ట పీఎస్‌ దక్కించుకున్న నేపథ్యంలో ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్‌లో అధికారులు, సిబ్బందితో ముచ్చటించారు. పోలీసు స్టేషన్‌లోని మౌలిక సదుపాయాలు, కేసుల పరిష్కారాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాల అమలును ఆయన పరిశీలించారు. కేరళ సీఎం విజయన్‌ రాక సందర్భంగా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments