షాకింగ్ వీడియో : స్టేజ్ పైనే కన్ను మూసిన కళాకారుడు

Tuesday, January 30th, 2018, 04:01:37 PM IST

మరణం మనిషిని ఎప్పుడు తాకుతుందో ఎవరికీ తెలియదు. అంతా బానే ఉంది అనుకునే లోపే ఎవరికి అనుమానం రాకుండా, కనిపించకుండా మృత్యువు సంబవిస్తుండడం నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొన్న హైదరాబాద్ లో క్రికెట్ ఆడుతూ ఒక యువకుడు నెల కూలిన సంగతి తెలిసిందే. అయితే అదే తరహాలో ఎవరు ఊహించని విధంగా స్టేజ్ పై ఒక కళాకారుడు నృత్యం చేస్తూ ప్రాణాలను విడిచాడు. అసలు వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నటుడు కలామండలం గీతానందన్ ఆలయం ప్రాంగణం సమీపంలో నృత్యం చేస్తుండగా ప్రాణాలను వదిలాడు.

58 ఏళ్ల ఒట్టంతులాల్ కళాకారుడు నృత్యం లో భాగంగా చేతులు జోడించి వంగి నమస్కరిస్తుండగా అలానే కూలిపోయాడు. సమీప వాయిద్యకారులు అతన్ని లేపే ప్రయత్నం చేసినా కదలిక లేకపోవడంతో వేంటనే ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో ఆయన మరణించినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు 30 సినిమాల్లో నటించిన గీతానందన్ సంగీత నాటక అకాడెమి పురస్కారం మరియు కలాందద్నల్ అవార్డుతో పాటు పలు పురస్కారాలను అందుకున్నారు.