శ్రీశాంత్ కు హైకోర్టు చావు దెబ్బ !

Wednesday, October 18th, 2017, 02:45:48 AM IST

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కుపోయిన శ్రీశాంత్ మరియు కొందరి ఆటగాళ్లపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. 2013 ఐపీఎల్ 6 స్పాట్ ఫింక్సింగ్ దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఫిక్సింగ్ చేశాడనే ఆరోపణలతో జీవితకాలం నిషేధిస్తూ శ్రీశాంత్ పై కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత దీనిపై శ్రీశాంత్ కోర్టులో పోరాడాడు. 2015 లో శ్రీశాంత్ ని కరుణిస్తూ అతడిపై ఉన్న నిషేధాన్ని కోర్టు ఎత్తివేసింది. ఆ తరువాత స్థానిక క్రికెట్ ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించగా బీసీసీఐ మాత్రం నిషేధాన్ని అలాగే కొనసాగించింది. దీనితో శ్రీశాంత్ మరలా కేరళ హైకోర్టుని ఆశ్రయించాడు.

క్రికెట్ ఆడేందుకు శ్రీశాంత్ కు కోర్టు అనుమతినిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ బీసీసీఐ శ్రీశాంత్ నిషేధాన్ని కొనసాగించాలని ఫిటిషన్ దాఖలు చేసింది.బీసీసీఐ వాదనలు విన్న హై కోర్టు వారితో ఏకీభవించింది. శ్రీశాంత్ నిషేధాన్ని పునరుద్దిస్తూ తీర్పు వెల్లడించింది. దీనితో శ్రీశాంత్ ఇక క్రికెట్ అవకాశాన్ని కోల్పోయాడు. శ్రీశాంత్ తో పాటు అంకిత్ చవాన్, అజిత్ చండీలా లపై కూడా నిషేధం కొనసాగుతోంది.