క్రేజీ చాలెంజ్ : ఈ పెళ్లి కూతురు పేరు చదవగలరా.?

Monday, May 14th, 2018, 04:22:59 PM IST

హ్యాపీగా పెళ్లి చేసుకోకుండా ఈ చాలెంజ్ ల గొడవ ఇంతా అనుకుంటున్నారా..? ఈ చాలెంజ్ పై సవాల్ విసిరింది మేము కాదు. స్వయానా పెండ్లి కుమారుడే చాలెంజ్ చేశాడు. కాని.. అతడు చేసిన చాలెంజే అతడి అయోమయంలో ముంచి చివరకు పోలీసులను ఆశ్రయించేలా చేసింది. అసలే ఈ పెళ్లి ఏంటీ, ఆ చాలెంజ్ ఇంతా అనుకుంటున్నారా పదండి వివరాల్లోకి వెళదాం.

కేరళలోని కొజికోడ్ ప్రాంతంలో నివసిస్తున్నవిభీష్ టీటీకు అనుకున్నట్టుగానే నచ్చిన అమ్మాయితో పెళ్లి కుదిరింది. దీంతో చాలా విభీష్ ఖుషి అయ్యాడు. పెళ్లి ఫిక్స్ అయ్యాక ఎవరు ఊరుకుంటారు మరి ఇక.. తన పెండ్లికి రావాలని తన ఫ్రెండ్స్‌కు, బంధువులకు పెండ్లి కార్డును వాట్సప్‌లో అందరికీ షేర్ చేశాడు. అయితే.. తన పెండ్లికి వచ్చేవాళ్లకు ఓ క్రేజీ కండీషన్ పెట్టాడు ఈ కుర్ర పెళ్లి కొడుకు. తను పెండ్లి చేసుకోబోయే అమ్మాయి పేరును ఎవరైతే కరెక్ట్‌గా పలుకుతారో వాళ్లకే ఈ ఆహ్వానం అన్నాడు. మిగతావాళ్లకు లేదని కాస్త ఫన్నీగా ఆలోచించి మెసేజ్ చేశాడు. ఇక.. తెలియందేముంది. సాధారణంగా ఒక మనిషికి బుర్ర తిరిగేలా చాలెంజ్ పెట్టి ఊరుకుంటే మనం విన్తామేమోగాని మన మన మనసు మాత్రం దాన్ని చేదించే వరకు వదలదు. ఆ పెండ్లి కార్డును చూసిన వాళ్లంతా కార్డు మీద ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి ఆ పేరు అర్థాన్ని విభీష్‌ను అడగసాగారు. ఒకరు.. ఇద్దరు ఫోన్ చేస్తే విభీష్ కూడా పోనీలే అని ఊరుకునేవాడెమో కానీ ఇక్క కథ రివర్స్ అయింది.. రోజుకు వందల కాల్స్ విభీష్‌కు, ఆయన తండ్రికి వస్తుండటంతో ఏం చేయాలో తెలియక జుట్టు పట్టుకొని కూర్చున్నాడు. మరికొంతమంది ఇంకాస్త ముందుకెళ్లి అతడికి ఫోన్ చేసి తిట్టడం ప్రారంభించారట. దీంతో ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యాడు విభీష్. పెళ్లి చేసుకుందామానుకుంటే ఆ పెళ్లి కాస్త ఇంకేదో అయింది.

ఇప్పటివరకూ చదివిందంతా ఒకే గానీ.. ఇంతకీ ఆ పెండ్లి కూతురు పేరేంది అని ఆలోచిస్తున్నారా? అందరినీ అయోమయం చేసిన ఆ అమ్మాయి పేరు ఇదే Dhyanoorhanagithy చదివారా? ఓ మళ్ళీ చదువుతున్నారా..? ఆ పేరును తెలుగులో రాయలేక మేముకూడా అలాగే ఇంగ్లీష్‌లోనే రాసేశాం. అసలా పేరు అలా ఎందుకు పెట్టారా అని తెలుసుకుందామని వెళ్తే ఆ పెండ్లి కూతురు తండ్రికి సాహిత్యంపై మమకారం ఎక్కువట. అందుకే.. కొత్తగా, వినూత్నంగా ఉండాలని తన కూతురుకు ఆ పేరు పెట్టాడట. మరి.. కూడా మీకు పుట్టబోయే పిల్లలకి ఇలాంటి పెర్ర్లు ట్రై చేస్తారేమో చూడండి.