ఆ హోటల్ లో బిల్లు ఉండదు.. తిన్నోడికి తిన్నంత ఫ్రీ!

Tuesday, March 6th, 2018, 03:19:22 PM IST

ఈ రోజుల్లో ఓ హోటల్ లో భోజనం చేయాలంటే మినిమమ్ 60 రూపాయలు ఉంటేగాని కడుపు నిండదు. టిఫిన్ రేట్లు కూడా బాగానే పెరిగాయి. అయితే కేరళలో మాత్రం ఓ హోటల్ లో ఎంత తిన్నా కూడా ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ బిల్లు అడిగేవారు ఉండరు. క్యాష్ కౌంటర్ అసలే ఉండదు. టిఫిన్ భోజనం కడుపు నిండా తినవచ్చు. కానీ ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అందుకు ఈ విషయం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఇంతవరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా కొనసాగుతోన్న ఈ మంచి కార్యక్రమం రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. కేరళలో పీపుల్స్‌ రెస్టారంట్‌’ అని పేరుతో ‘స్నేహజలకం’ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతోంది. ఒకేసారి 2000 మందికి ఉచిత భోజన సదుపాయం కలిపించే వసతిని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎదో నాసిరకం కూరగాయలు అనుకుంటే పొరపాటే.. అన్ని స్వచ్ఛమైన కూరగాయలు. రెస్టారెంట్ సమీపాన 2.5 ఎకరాల స్థలంలో స్వచ్చంధ కార్యక్రమాన్ని నడిపే వారే కూరగాయలను పండిస్తారు. ఇక భోజనం చేసిన తరువాత ఎవరికైనా ఇష్టం ఉంటే హోటల్ లో ఉంచిన ఓ బాక్సులో తోచినంత డబ్బు వేయవచ్చు. బయట నుంచి ఎక్కువగా విరాళాలు కూడా అందుతున్నాయి. ఆ డబ్బుతో అందరికి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు సంస్థ సభ్యులు.