జగన్‌ని కైమా కైమా చేశేవార‌ట‌.. కేసినేని నాని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..!

Saturday, October 27th, 2018, 12:36:17 PM IST

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హ‌త్యాయ‌త్న ఘ‌ట‌న పై టీడీపీ నేత‌ల విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. విజ‌య‌న‌గ‌రంలో గురువారం పాద‌యాత్ర ముగించుకున్న అనంత‌రం.. హైద‌రాబాద్‌కు వచ్చేందుకు.. విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో జ‌గ‌న్ పై క‌త్తితో దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబార్ న్యూరో ఆస్ప‌త్రిలో చికిత్స అనంత‌రం శుక్ర‌వారం మ‌ధ్యాహ్న‌ జ‌గ‌న్ డిశ్చార్జ్ అయ్యారు. అయితే జ‌గ‌న్ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే అనేకమంది నేత‌లు ఆ దాడిని ఖండించి ప‌రామ‌ర్శిస్తుంటే.. టీడీపీ నేత‌లు మాత్రం రివ‌ర్స్‌లో జ‌గ‌న్ పైనే విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత అయిన చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్య‌క‌ర్త‌లు, జ‌గ‌న్ ఘ‌ట‌న నాట‌క‌మ‌ని, ఆయ‌న ముఖ్య‌మంత్రి కావాల‌ని సొంత అభిమాని చేత చాలా తెలివిగా పొడిపించుకున్నార‌ని వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప్ర‌జ‌ల్లో సానుభూతి తెచ్చుకునేందుకే జ‌న‌న్ కోడి క‌త్తి ప్లాన్ వేశార‌ని.. అయితే ప్లాప్ అయ్యింద‌ని విమ‌ర్శిస్తున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్ ఘ‌ట‌న ఒక జ‌గ‌న్నాట‌క‌మ‌ని నారాలోకేష్ అన‌గా.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అల్ల‌ర్లు జ‌రిపి టీడీపీ స‌ర్కార్‌ణి గ‌ద్దె దింపి రాష్ట్ర‌ప‌తి పాల‌న తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స్వయానా చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. అయితే తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని వ్యాఖ్యానిస్త‌నూ.. తాము త‌ల‌చుకుంటే జ‌గ‌న్‌ని కైమా కైమా చేశేవార‌మ‌ని.. అలాంటి ప‌ల్ల దాడులు తాము చేయ‌మ‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. మ‌రి కేశినేని వ్యాఖ్య‌ల పై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.