కెవ్వు కేక : ‘ఐ ఫోన్ 7 ప్లస్’ లో ఎన్ని కొత్త హంగులో..!

Sunday, January 10th, 2016, 08:00:44 PM IST


స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన ఫోన్ ఏదంటే ముందుగా గుర్తొచ్చే పేరు ‘యాపిల్’. అన్ని ప్రపంచ దేశాల్లోనూ ఈ ఫోన్ల వినియోగం చాలా ఎక్కువే. పైగా ప్రపంచ మొబైల్ మార్కెట్ లో ఈ కంపెనీ షేర్లే ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ ఫోన్లకే ఎందుకింత ఆదరణ అంటే కంపెనీ విడుదల చేసే ప్రతి మోడల్ దాని ముందు విడుదలైన మోడల్ కన్నా అడ్వాన్స్డ్ గా ఉండటం, సరికొత్త ఫీచర్లతో రావటమే. ఈ ఫోన్లకున్న క్రేజ్ ఏంతంటే ఏదైనా మోడల్ ను విడుదల చేస్తున్నాం అని కంపెనీ ప్రకటించగానే ఒకరోజు ముందు నుండే యాపిల్ షో రూమ్ ల ముందు వినియోగదారులు క్యూకడుతుంటారు. ప్రస్తుతం యాపిల్ అలాంటి కొత్త మోడల్ నే త్వరలో మార్కెట్లోకి విడుదల చేయటానికి సిద్దమవుతోంది. అదే ‘ఐ ఫోన్ 7 ప్లస్’. మునుపటి మోడల్ 7 కన్నా ఈ మోడల్ కున్న ప్రత్యేకతలేంటో ఒక్కసారి చూద్దాం..

* రాబోయే ఈ ఐ ఫోన్ 7 ప్లస్ లో ఐ ఫోన్ 7 కన్నా ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీని అమర్చనున్నారు. దీంతో బ్యాటరీ లైఫ్ మునుపటి కంటే 12. 5 % పెరగనుంది.

* బ్యాటరీతో పాటు ఈ ఫోన్ మెమెరీ కెపాసిటీ కూడా బాగానే ఇంప్రూవ్ చేశారు. రాబోయే ఈ ఫోన్ లో 256 జీబీ మెమరీ సామర్ధ్యం ఉండబోతోంది.

* ఇందులో మునుపటి మోడళ్ళలో ఉన్న బిగ్ స్క్రీన్, కెమెరా సామర్థ్యం అలాగే ఉండనున్నాయి.

*ఇందులో ఉండబోయే బ్యాటరీ సామర్థ్యం ఎక్కువ కావటం వల్ల మునుపటి కన్నా ఎక్కువ బ్యాక్ అప్ ఉండబోతోంది. దీంతో అనేక రకమైన యాపిల్ యాప్స్ ను వినియోగంలో ఉంచుకోవచ్చు.

* రాబోయే 7 ప్లస్ లో ఉండబోయే త్రీడీ టచ్ స్క్రీన్ లో ఇంతకు మునుపున్న త్రీడీ టచ్ స్క్రీన్లలో లేని హోమ్ బటన్ ను మొదటిసారిగా ఇవ్వనున్నారు.

* ఈ మోడల్ ను యూజర్ సౌకర్యంగా చేతిలో పట్టుకునేందుకు వీలుగా తయారుచేస్తున్నట్లు, పైగా ఫోన్ చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్ ను అమర్చనున్నట్లు సంస్థ తెలిపింది.

ఈ విధంగా అన్ని రకాల అడ్వాన్స్డ్ ఫీచర్లతో రాబోయే ఐ ఫోన్ 7 ప్లస్ ఎలా ఉండబోతోందో చూడాలన్నా.. వాడాలన్నా కొన్నిరోజులు ఆగాల్సిందే మరి.