దేశానికి మంచి చేయాలనీ ఉంది.. అందుకే వచ్చా: ఖలీ

Thursday, January 25th, 2018, 10:40:39 AM IST

డబ్ల్యూడబ్ల్యూఈ తో ఒక్కసారిగా ప్రపంచంలో సూపర్ స్టార్ గా ఎదిగిన గ్రేట్ ఖలీ ఇండియా గర్వపడేలా చేశాడు. డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఒకప్పుడు వివిధ దేశాల బలవంతులు మాత్రమే ఉండేవారు. కానీ ఖలీ అడుగుపెట్టిన తరువాత అసలైన యుద్ధం మజా మొదలైంది. అయితే పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఖలీకి తన ఉరన్నా దేశమన్నా చాలా ఇష్టం. అయితే ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ లో మంచి ఇల్లు వ్యాపారం ఉందని ఖలీ ఇటీవల అమృత్ సర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పాడు. ఒక్కసారి అక్కడ అడుగుపెడితే అక్కడే ఉండాలని ఉంటుంది. కానీ అక్కడ తనకు ఉండడం ఇష్టం లేదని నా దేశానికి ఎదో ఒకటి తనవంతు సాయంగా కృషి చేయాలనీ ఆశపడుతున్నట్లు ఖలీ వివరించాడు. తప్పకుండా తాను అనుకున్నది చేస్తాను అంటూ ప్రస్తుతం తన సంపదతో జలంధర్‌ లో సీడబ్ల్యుఈ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపాడు. మరల యుద్ధం కోసం తన దగ్గర 250 మంది శిక్షణ తీసుకుంటున్నారని ఆ క్రీడను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వివరించాడు.