కిడారి హ‌త్య‌కు కారణం వారేనా?

Saturday, September 29th, 2018, 12:28:07 PM IST

దేశ వ్యాప్తంగా నీచ రాజ‌కీయాలు న‌డుస్తున్న త‌రుణ‌మిది. రాజ‌కీయ‌ ప‌బ్బం గుడుపుకోవ‌డం కోసం పేరు పొందిన పార్టీ అధినాయ‌క‌గ‌ణం నీతిమాలిన ప‌నుల‌కు పాల్ప‌డుతూ రాజ‌కీయాలంటేనే వెగ‌టు పుట్టేలా చేస్తున్నారు. ప్ర‌త్య‌ర్థి పార్టీని దెబ్బ‌తీయాలన్నా… త‌మ స‌భ్యుల‌ను పెంచుకోవాల‌న్నా ఎలాంటి నీచానికైనా వెన‌కాడ‌ని దౌర్భాగ్య‌పు ప‌రిస్థితుల్లో నేటి రాజ‌కీయ‌ వ్య‌వ‌స్థ వుంది. తెలంగాణ‌లో తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కూల‌దోయ‌డం కోసం నామినేటెడ్ ఎమ్మెల్యేని బేర‌మాడిన టీడీపీ అధినాయ‌క‌త్వం వైసీపీ ఎమ్మ‌ల్యే కిడారి స‌ర్వేశ్వ‌ ర‌రావు విష‌యంలోనూ అదే నీతిమాలిన ప‌నికి పూనుకుని నిండు ప్రాణాన్ని బ‌లితీసుకుంది.

అర‌కు నియోజ‌క వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ ర‌రావు ని ఇటీవ‌ల మావోయిస్టులు అత్యంత దారుణంగా హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే. ఈ హ‌త్య వెనుక పార్టీ ఫిరాయింపు ఓ కార‌ణ‌మ‌ని, అందుకు టీడీపీ నుంచి 30 కోట్లు తీసుకుని న‌క్స‌ల్స్ హ‌త్య చేశార‌న్న చ‌ర్చ ఏపీ పొలిటిక‌ల్ కారిడార్‌లో సాగుతోంది. ఓ క్వారీ విష‌యంలో వ‌చ్చిన విభేదాలే కార‌ణ‌మ‌ని ప్ర‌చారం సాగినా.. ఇదో ప్రీప్లాన్డ్ మ‌ర్డ‌ర్ అన్న చ‌ర్చ వేడెక్కిస్తోంది. కార‌ణం ఇదీ అని మావోయిస్టులు చెబుతున్నా.. అది త‌ప్పు దారి ప‌ట్టించే వ్య‌వ‌హార‌మేన‌న్న అనుమానాలు ర‌గులుకున్నాయి. హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో వున్న కొంత మంది స్థానికులు కూడా ఇదే విష‌యాన్ని చెబుతుండ‌టం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ప్ర‌లోభానికి పార్టీ మారినందుకే.. కిడారి నిండు ప్రాణాన్ని బ‌లి తీసుకున్న‌ట్ల‌యింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.