ప్రీతి జింతా షాకింగ్ డెసిషన్..’కింగ్స్ ఎలెవన్’ నచ్చలేదా..?

Monday, January 29th, 2018, 10:56:35 PM IST

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కో ఓనర్ ప్రీతి జింతా సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ జట్టు పేరు మార్చాలని ప్రీతి జింతా ఆసక్తిగా ఉందట. ఐపీఎల్ 2018 సీజన్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రీతి జింతా నిర్ణయం క్రికెట్ వర్గాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. గడచిన 10 ఐపీఎల్ సీజన్ లలో ఒక్కసారిగా కూడా పంజాబ్ జట్టు టైటిల్ గెలుచుకోలేకపోయింది. కేవలం ఒకసారి మాత్రం ఫైనల్ కు చేరింది. దీనితో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనే పేరు కలసి రావడంలేదని, పేరు మార్చలసిందే అని ప్రీతి పట్టుదలగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే తన ప్రతిపాదనని ప్రీతి బీసీసీఐ కు పంపినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రీతి ప్రతిపాదనకు బీసీసీఐ ఒకే చెబుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఈ సీజన్ వేలం లో కూడా ప్రీతి జింతా చాకచక్యంగా వ్యవహరించి పటిష్టమైన టీంని కొనుగోలు చేసింది. ఈ ఐపీఎల్ లో పంజాబ్ అదృష్టం ఎలా ఉందొ చూడాలి.