సొంత గూటికి చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్

Friday, July 13th, 2018, 03:02:00 PM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆఖరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన తరువాత ఊహించని నిర్ణయాలతో ముందుకు సాగారు. సపరేట్ గా ఒక పార్టీ పెట్టి జనాలను ఆకర్షించాలని అనుకున్నారు. ఇక ఎలక్షన్స్ తరువాత ఓటమి చెందడంతో మళ్ళి కనిపించలేదు. ఇక ఇటీవల కాలంలో ఆయన మళ్లీ తెరపైకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా ఫెయిల్ అయ్యింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే కోలుకోలేని స్థితిలో ఉంది. పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి సీనియర్ నాయకుల అవసరం ఎంతైనా ఉందని కిరణ్ కుమార్ రెడ్డిని మరోసారి పార్టీలోకి స్వాగతం పలికారు.

శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలోకి అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలపరచేలా ముందుకు సాగాలని కాంగ్రెస్ నేతలకు రాహుల్ సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులూ ఉమెన్‌ చాందీ, అశోక్‌ గెహ్లాట్‌, పళ్లంరాజు, రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే రెండు తెలుగురాష్ట్రాల్లో సభలను నిర్వహించి మరికొంత మంది లీడర్లను కాంగ్రెస్ తనలో కలుపుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఓట్లన్నీ వైఎస్ జగన్ కు వెళ్లాయి. మళ్ళీ ఆ ఓట్లు కాంగ్రెస్ కు రావాలని ఏపి నేతలు కృషి చేస్తున్నారు. మరి కాంగ్రెస్ ఎంతవరకు పుంజుకుంటోందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments