టీజింగ్ ట్రైలర్ : కిర్రాక్ పార్టీ..కృష్ణుడొచ్చాడ్రా, ఇక కురుక్షేత్రమే..!

Wednesday, January 31st, 2018, 06:45:11 PM IST

యువ హీరో నిఖిల్ నిర్మాతలకు ఓ వరం. తక్కువ టైం లోనే నిఖిల్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిఖిల్ సినిమా చూడడానికి యువత ఎగబడుతుంటారు. కాగా నిఖిల్ నుంచి వస్తున్న మరో యూత్ ఫుల్ మూవీ కిర్రాక్ పార్టీ. ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఘనవిజయం సాధించిన కన్నడ చిత్రానికి ఇది రీమేక్. తాజగా టీజింగ్ ట్రైలర్ పేరుతో దాదాపు నిమిషం నిడివి గల ట్రైలర్ ని విడుదల చేసారు.

యువతని మెప్పించే అంశాలు ఈ ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిఖిల్ ని ఉద్దేశించి బ్యాక్ గ్రౌండ్ లో ఓ డైలాగ్ వినిపిస్తోంది. ‘కృష్ణుడొచ్చాడ్రా..ఇక కురుక్షేత్రమే’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. కాలేజీ యువత నేపథ్యంలో ఈ కథ సాగనునట్లు తెలుస్తోంది. శరన్ ఏ చిత్రానికి దర్శకత్వం వహించారు. సంయుక్త మరియు సిమ్రాన్ లు హీరోయిన్లుగా నటించారు.