వాస్తవాలకు విరుద్దం

Monday, October 13th, 2014, 07:54:47 PM IST

kcr_kishan_reddy
తెలంగాణ రాష్ట్రంలో విధ్యుత్ సమస్య తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. కాగ, అదనపు విద్యుత్ కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు కోరడంలేదని తెలంగాణ బీజేపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు విధ్యుత్ సమస్యలతో తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారి సమస్యలు కొంచమైన పట్టించుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పేదల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉన్నదని, వారి జీవితాలతో ఆడుకోవడం సరికాదని అన్నారు. వాస్తవాలకు విరుద్దంగా ప్రభుత్వం నడుస్తున్నదని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో సమగ్ర సర్వే తరువాత..వృద్దులు, వికలాంగుల నుంచి కొత్త దరఖాస్తులు కోరుతున్నారని ఆయన ప్రశ్నించారు.